China | Funeral | Strippers | Death

Excellent china s funeral strippers told to cover up

china, funeral, death celebrations, strippers, grandly

If you were mourning the loss of a loved one in China, at least the entertainment might have cheered you up. Until now. In rural China, hiring exotic dancers to perform at wakes is an increasingly common practice, but is now the latest focus of the country's crackdown on vice. Strippers are invited to perform at funerals, often at great expense, to attract more mourners, China's official Xinhua news agency said.

అక్కడ చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరూ..

Posted: 04/24/2015 03:21 PM IST
Excellent china s funeral strippers told to cover up

సాపాటు ఎటూ లేదు పాడు బ్రదర్.. రాజధాని నగరంలో వీది వీధి అన్ని నావే.. అంటూ ఆకలిరాజ్యంలో శ్రీశ్రీ రాసిన పాట మనలో ఎంత మందికి గుర్తుందో లేదో తెలియదు. కానీ చైనాలో ఓ గ్రామంలో మాత్రం శ్రీశ్రీగారి మాటలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఏం పాటిస్తున్నారనేగా.. రాజధాని నగరంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరూ అని శ్రీశ్రీ రాసిన వాక్యాలను బాగా ఫాలో అవుతున్నారు. అదేంటి చావును కూడా పెళ్లిలాగే చేస్తున్నారా ఏంటీ అనుమానం వచ్చిందా.. అయితే దానికి ఆ స్టోరీ చదివితే క్లారిటీ వచ్చేస్తుంది.

death-celebrations-china

చైనా దేశంలోని హిబియయ్ అనే ప్రాంతానికి దగ్గరలో చెంగ్ అనే పాత కాలం నాటి గ్రామం ఉంది. అయితే అంత పాత గ్రామం గురించి తెలుసుకొవాల్సినంత విశేషం ఏమొచ్చిందంటే అక్కడి ఆచారం అందరికి వింతగానూ ఒకింత ఆశ్చర్యంగానూ అనిపిస్తోంది. మన చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే మామూలుగా రాత్రంతా జాగరణ చేసి ఉదయానికి ఖననం కానించేస్తాం. అయితే మనం చేసే జాగరణను చైనాలోని ఈ ఊరు కాస్త డిఫరెంట్ గా చేస్తోంది అది ఎలాగంటారు డ్యాన్సుర్ లతో డ్యాన్స్ లు చేయిస్తూ.. ఏంటీ డ్యాన్సర్స్ డ్యాన్స్ చెయ్యడం ఏంటీ అని అనుకోకండి నిజం. చావు ఇంటికి వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా డ్యాన్స్ ప్రోగ్రాంలాంటిది ఏర్పాటు చేస్తారు. గతంలో కేవలం కొన్ని పాత కాలం పాటు వేసుకొని డ్యాన్సులు చేసేవారు. అయితే తరువాత ట్రెండ్ మారింది ఇప్పుడు కొత్త కొత్త పాటలు వేసి, స్టెప్పులతో అదరగొడుతున్నారు. అంతేనా డిజెల వరకు వ్యవహారం వచ్చింది అంటే చావు ఎంత ఎంటర్ టెయినింగ్ గా ఉంటుందో ఆలోచించండి. అయితే అసలు ఈ ఆచారం ఎలా వచ్చింది అంటే.. పూర్వం చనిపోయిన వారికి కన్నీటి వీడ్కోలు కాకుండా కాస్త ఉల్లాసంగా సాగనంపాలని కొన్ని జానపద పాటలకు కొంత మంది చేరి డ్యాన్స్ చేసేవారు. అయితే అదే క్రమంగా ఎంటర్ టెయిన్ మెంట్ గా మారిపోయింది. దీన్ని శ్రీశ్రీ ఎప్పడో చెప్పారు కాకపోతే ఆయన రాజధానిలో చావు కూడా పెళ్లి లాంటిదే అన్నారు ఇక్కడ మాత్రం గ్రామం ఉంది అంతే తేడా.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  funeral  death celebrations  strippers  grandly  

Other Articles