Telangana ruling party plans show of strength

Hyderabad turns pink for trs meeting

Hyderabad turns pink for TRS meeting, Telangana ruling party plans show of strength, Telangana Rashtra Samiti, TRS plenary, formation of Telangana state, Lal Bahadur stadium, TRS Plentary, KCR, Taraka Ramarao IT Minister, Kavitha, Farmers Die, Chandrasekhar Rao, TRS plenary , An ambitious arrangements , Ministers, party chiefs monitoring

Hyderabad has turned pink as the ruling Telangana Rashtra Samiti has pulled out all stops to make its first plenary after the formation of Telangana state a big show of strength.

టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్దం.. గులాబివర్ణమైన నగరం..

Posted: 04/23/2015 10:16 PM IST
Hyderabad turns pink for trs meeting

తెలంగాణలో అధికారిక పార్టీ టీఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. వీఐపీలకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌ నగరం ముస్తాబ్‌ అయింది. గ్రేటర్ యావత్తు గులాభివర్ణంగా మారింది. ఎండకు, వానకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎల్బీ స్టేడియం సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న తరుణంలో కనీవినీ ఎరుగని రీతిలో సంబరాలు చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. నగరంలోని ఎల్బీస్టేడియంలో 40 వేలమందితో ప్లీనరీ నిర్వహనకు ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వర్షం పడినా ఇబ్బంది లేకుండా స్టేడియం అంతా రేకులతో కప్పేశారు.

వేసవికాలం కావడంతో వేడి నుంచి ఉపశమనానికి 300 కూలర్లు ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అందుబాటులో ఉంచారు. ప్రతినిధుల కోసం మంచినీళ్లతోపాటు స్టేడియంలోకి వెళ్లే నాలుగు గేట్ల వద్ద మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల కూడళ్లును గులాబీ మయం చేశారు. నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో సీఎం కేసీఆర్‌ కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రతినిధులకు వేదిక కనిపించడంలేదనే ఇబ్బందులు లేకుండా ఆరు బారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు.

వేదిక ముందు వీఐపీలు, మహిళలు, మీడియాకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్‌ నగరానికి వచ్చే 11 ప్రధాన రోడ్లకు మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్చార్జులుగా నియమించారు. 250 మంది కూర్చేనే విధంగా భారీ స్టేజ్‌ నిర్మించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ప్లీనరీ రాత్రి 8 గంటల వరకు జరగనుంది. కేసీఆర్‌ను అధ్యక్షుడుగా మరో పర్యాయం ఎకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారికంగా ఈ ప్లీనరీ సమావేశంలో ప్రకటించనున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS plenary  An ambitious arrangements  Ministers  party chiefs monitoring  

Other Articles