From parliament to pilgrimage: Rahul Gandhi to trek to Kedarnath

Rahul gandhi to trek to kedarnath shrine

Rahul Gandhi to trek to Kedarnath shrine, rahul gandhi From parliament to pilgrimage, rahul gandhi uttarakhand tour, land acquisition bill, Congress vice president Rahul Gandhi, Rahul Gandhi trekking skills, rahul heads to Uttarakhand, rahul gandhi to visit Kedarnath shrine.

After taking on the government in parliament over the land acquisition bill following his return from a 56-day sabbatical, Congress vice president Rahul Gandhi will display his trekking skills when he heads to Uttarakhand on Thursday to visit the Kedarnath shrine.

కేధార్ నాథ్ ను దర్శించుకోనున్న రాహుల్ గాంధీ

Posted: 04/22/2015 10:27 PM IST
Rahul gandhi to trek to kedarnath shrine

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీర్ఘకాలిక సెలవు తరువాత వరస కార్యక్రమాలతో బిజీగా మారాడు. సెలవు నుంచి వచ్చి రావడంతోనే భూ సేకరణ బిల్లుపై రైతు సంఘాల నాయాకులను కలసిన యువనేత.. అదివారం హస్తినలో జరిగిన ధర్నాలో పాల్గొని తనదైన శైలిలో.. గతానికి భిన్నంగా మంచి వాగ్ధాటితో, అవగాహనతో రైతులను అకట్టుకునే ప్రయత్నం చేశాడు. భారత్ లాంటి దేశాలలో డిజిటలైజేషన్ కన్నా రైతు సంక్షేమమే ముఖ్యమని, రైతలకు కాంగ్రెస్ మినహా ఏ పార్టీ అండగా వుండదని చెప్పారు. రైతులకు అండగా తానుంటానని, భూ సేకరణ బిల్లులో మార్పులకు తాము విరద్దమని చెప్పారు.

ఆ తరువాత మంగళవారం రోజున కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకురానున్న నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకంగా ఆయన స్పందించారు. నెట్ న్యూట్రాలిటీపై చర్చ జరగాలని, న్యూట్రాలిటీపై బిల్లును తీసుకురావాల్సిన అవశ్యకత వుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం పార్లమెంటులో ఆయన మోడీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. మోడీ ప్రభుత్వం నెట్ న్యూట్రాలిటీని బడా కార్పోరేట్ కంపెనీలకు దాసోహం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తనకు మునుపటి రాహుల్ కు వత్యాసం వుందని, తాను కాంగ్రెస్ పార్టీని ఒంటిగా ముందుకు తీసుకెళ్లగలనన్న నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే గురు శుక్రవారాల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ కేదార్నాథ్ ఆలయానికి నడిచి వెళ్లనున్నారు. గురువారం డెహ్రాడూన్ వెళ్లి, అక్కడి నుంచి శుక్రవారం నాడు నడిచి వెళ్తారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మీడియా ఇన్చార్జి సురేంద్రకుమార్ చెప్పారు. పార్టీ ఉత్తరాఖండ్ వ్యవహారాల ఇన్చార్జి అంబికాసోనీతో కలిసి గురువారం ఉదయం ఆయన జాలీగ్రాంట్ ఎయిర్పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి గౌరీకుండ్ వెళ్లి, లించౌలి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఒకరాత్రి విశ్రాంతి తీసుకుని, శుక్రవారం నాడు కేదార్నాథ్ ఆలయానికి నడిచి వెళ్తారు. ఆయనతోపాటు ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ, మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. ఇంత పెద్ద స్థాయి నాయకుడు కేదార్నాథ్ వెళ్లి పరమశివుడిని దర్శించుకోవడం ఇదే తొలిసారి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  kedarnath tour  rahul trekking  

Other Articles