Congress | Rahulgandhi | Farmers | Met | Rally

Congress vice president rahul gandhi met farmers

congress, rahul gandhi, leave, tour, rally, upa, nda, landpooling, farmers

Congress vice-president Rahul Gandhi met farmers from western Uttar Pradesh, Haryana, Rajasthan and Delhi on Saturday morning, ahead of the “kisan-khet mazdoor” rally on Sunday.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రైతుల ముందుకు రాహుల్

Posted: 04/18/2015 12:57 PM IST
Congress vice president rahul gandhi met farmers

చాలా కాలం సెలవు తర్వాత రాహుల్ గాంధీ జనాల మధ్యకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు అనుకుంటే ఉన్నట్లుండి సెలవుపై ఎక్కడికో వెళ్లిపోయారు. మొన్న ఉదయం ఢిల్లీకి చేరుకున్న రాహుల్ బాబు నిన్న రెస్ట్ తీసుకున్నారట. శనివారం ఉదయం వివిధ రైతుసంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే  రైతుర్యాలీకి సన్నాహకంగా  వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ రైతు ప్రతినిధులు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. రాజస్థాన్,  పంజాబ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో భూసేకరణ సవరణ బిల్లుపై చర్చించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉంది. బీజేపీ ప్రభుత్వ భూసేకరణ సవరణ బిల్లు, రైతు, పేద ప్రజల వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్  పార్టీ ఆదివారం కిసాన్ ఖేత్ మజ్దూర్ ర్యాలీ నిర్వహించనున్నారు.

farmersmetrahulgandhi01

farmersmetrahulgandhi02

భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్‌ తలపెట్టిన ర్యాలీకి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులను ఢిల్లీ తరలించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ,  సోనియాగాంధీ కూడా హాజరవుతున్నారు. ఈ ర్యాలీని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ర్యాలీని విజయవంతం చేసేందుకు ముందస్తుగానే ఏర్పాట్లను ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అనేక రాష్ట్రాల్లో భూసేకరణ ఆర్డినెన్స్‌పై సభలు, సమావేశాలు నిర్వహించింది. ర్యాలీ ఏర్పాట్లపై ఢిల్లీలో కాంగ్రెస్‌ నాయకులు సమావేశమయ్యారు.మొత్తానికి చాలా కాలం తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన రాహుల్ గాంధీ బిజీబిజీగా గడపనున్నారు. మరి ర్యాలీలో రాహుల్ గాంధీ స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ర్యాలీ ఎలా అవుతుందో.. రాహుల్ గాంధీ ఏం చేస్తారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  rahul gandhi  leave  tour  rally  upa  nda  landpooling  farmers  

Other Articles