Chandrababunaidu | Change | House

Ap cm chandrababu naidu changed his home from juliehills road no65 to road no24

chandrababu, babu, house, change, vasthu, ap,

Ap cm chandrababu naidu changed his home from juliehills road no65 to road no24. After won as ap cm thrice chandrababu wish to change his own house asper vasthu.

కొత్త ఇల్లు.. కొత్త ఆలోచన అదిరిందయ్యా చంద్రం

Posted: 04/18/2015 12:32 PM IST
Ap cm chandrababu naidu changed his home from juliehills road no65 to road no24

కొత్త ఇల్లు కొత్త పెళ్లాం అదిరిందయ్యా చంద్రం.. అంటూ తెలుగులో ఓ పెయింట్ యాడ్ లో వినిపిస్తూ ఉండేది. అయితే అందులో ఉన్న చంద్రానికి మేము చెబుతున్న చంద్రానికి సంబందం లేదు. కానీ ఆ డైలాగ్ మాత్రం మన ఏపి సిఎం చంద్రబాబునాయుడుకు కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకంటారా నారా చంద్రబాబు నాయుడు ఏపి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తన పాత ఇంటిని మార్చేస్తున్నారు. అందులో భాగంగా కొత్త ఇంట్లోకి మారారు. అందుకే ఈ డైలాగ్ ను చంద్రబాబు నాయుడుకు సింక్ చేశాం.

 ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెం. 65లో ఉంటున్న చంద్రబాబు కుటుంబం, జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెం. 24లో గల ఓ అద్దె ఇంట్లోకి మారారు. ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతలు, సందర్శకుల తాకిడి పెరగడంతో ఇళ్లు ఇరుకుగా మారిందని, దీంతో ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చివేసి, ఆ స్థానంలో కొత్త భవన నిర్మాణాన్ని నిర్మించనున్నారు. అయితే ఇంటి మార్పుకు వాస్తు కూడా ఒక కారణం అయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కొత్త ఇల్లు మారిన చంద్రబాబుకు ఎంత వరకు కలిసి వస్తుందో ఎలా అదరగొడతాడో చూడాలి.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  babu  house  change  vasthu  ap  

Other Articles