Telangana | GHMC | Eletions | TRS | Eight months

Telangana govt trying postpon the ghmc elections for eight months

Telanaga, high court, ghmc, corporation, bc, divisions, tdp, bjp, trs, kcr,

Telangana govt trying postpon the GHMC elections for eight months. The TRS partys leaders and senior members suggest the govt to conduct ghmc elections after eight months. If ghmc elections will conduct after eight months the trs party will get positive result.

జీహెచ్ఎంసీ ఎన్నికలను సా..గదీస్తారా?

Posted: 04/18/2015 07:47 AM IST
Telangana govt trying postpon the ghmc elections for eight months

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకు కొంత గడువు లభిస్తే బాగుంటుందని భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి కనిపించిన తరువాత ఎన్నికలు జరిగితే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని అధికార పక్షం భావిస్తోంది. బిసి జనాభా గణన, వార్డుల విభజన పూర్తి కావడానికి ఎనిమిది నెలల సమయం పడుతుందని, ఆ తరువాత ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. అంత గడువు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అయితే సాధ్యమైనంత వరకు గడువు లభించేట్టు చేయడం ద్వారా హైదరాబాద్‌లో కొన్ని వర్గాలకు ప్రయోజనం కలిగించే పథకాలు చేపట్టవచ్చునని అధికార పక్షం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 200 వార్డులకు విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వాహణకు ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదని నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వార్డుల సంఖ్యను 150 నుంచి రెండు వందలకు పెంచడం, బిసి లెక్కల సేకరణ వంటి పనులు పూర్తయిన తరువాత ఎన్నికల నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. గ్రేటర్ ఎన్నికలకు టిఆర్‌ఎస్ భయపడుతోందని విపక్షాలు చేస్తున్న వాదనలో వాస్తవం లేదని అన్నారు. సికిందరాబాద్ కంటోనె్మంట్ ఎన్నికల్లో విపక్షాలు ఇదే విధంగా మాట్లాడాయని తలసాని గుర్తు చేశారు. తీరా టిడిపి, బిజెపి కూటమికి ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేదని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా విజయం సాధిస్తామని చెప్పారు.

హైదరాబాద్ సనత్‌నగర్ నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉంది. ఇలాంటి కొన్ని పథకాలు ముమ్మరంగా చేపట్టిన తరువాత ఎన్నికలు జరిగితే అది పార్టీకి ఉపయోగపడుతుందనే ఆలోచనలో వీటిని వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు వంద గజాల లోపు ఆక్రమించుకుంటే ఉచితంగా క్రమబద్ధీకరించడం, నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ వంటి పథకాల వల్ల రాజధాని నగరంలో పేదల నుంచి తమ పార్టీకి మద్దతు లభిస్తుందని టిఆర్‌ఎస్ ఆశిస్తోంది.అదే విధంగా ఐటి రంగంలో అభివృద్ధి వల్ల విద్యావంతుల వర్గం మద్దతు ఆశిస్తున్నారు. ఐటి రంగంలో లక్షలాది ఉద్యోగాలకు ఉన్న అవకాశాలపై దృష్టిసారించారు. ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా నిరుద్యోగుల్లో విశ్వాసం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం మాటలే కాదు కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకుని, చర్యలు అమలు చేసినప్పుడే మద్దతు లభిస్తుందని పార్టీ నాయకులు అంటున్నారు.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telanaga  high court  ghmc  corporation  bc  divisions  tdp  bjp  trs  kcr  

Other Articles