Woman raped in Delhi, cab driver arrested

Woman raped in delhi cab driver arrested

32-year-old woman raped, Delhi Metro station, cab driver raped passenger, raped driver arrested, west Delhi's Dwarka area, Dwarka Mor station to Madhu Vihar, pretext of filing CNG, raped woman inside the cab, woman raped, woman raped in delhi, crime against women, violence against women,

A 32-year-old woman who hired a cab from a Delhi Metro station was raped by its driver at a secluded place, police said on Friday. The driver has been arrested

ఢిల్లీలో మరో దారుణం, మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం..

Posted: 04/10/2015 09:35 PM IST
Woman raped in delhi cab driver arrested

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. మరో అడపడచుపై మగమృగం కాటేసింది. ప్రభుత్వాలు మారినా.. పటిష్ట చట్టాలు వచ్చినా.. మహిళలపై పాశవికంగా దాడి చేసే మగమృగాళ్లకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిర్భయ ఘటనలో నిందితులకు శిక్షలు పడినా, అత్యాచార కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినా.. అబలలపై అఘాయిత్యాలు మాత్రం అడ్డుఅదుపు లేకుండా సాగుతున్నాయి. దేశ రాజధానిలో సంచలనం రేపిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచార ఘటనను మరువక ముందే మరో క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

గురువారం రాత్రి ద్వారకా మెట్రో స్టేషన్ నుంచి మధు విహార్ లోని తన ఇంటికి వెళ్లేందుకోసం బాధితురాలు క్యాబ్ను అద్దెకు మాట్లాడుకుంది. క్యాబ్ డ్రైవర్ తన కారులో సీఎన్ జీ గ్యాస్ నింపుకునేందకని మాయమాటలు చెప్పి.. క్యాబ్ ను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి, క్యాబ్లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. కేసు నమోదు చేసి క్యాబ్ డ్రైవర్ను అరెస్ట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman rape  cab driver  delhi  

Other Articles