Beedi business owner Shyama Charan Gupta questions cancer link

Shyama charan gupta questions cancer link

controversy coments on tobacco, controversy comments on sugar, ban on sugar, ban on tobacco, Pictorial Warning, Tobacco Products, Mp Shyama Charan Gupta, Beedis Less Harmful Than Sugar

A controversy broke out on Thursday over remarks by 'beedi' baron and a parliamentary committee member from BJP, Shyam Charan Gupta, suggesting "nil" effect of smoking, evoking sharp reaction from Opposition parties which sought his removal from the panel.

చక్కెర పోగాకు కన్నా అనారోగ్యకరం.. నిషేదించగలరా..? బీజేపి ఎంపీ

Posted: 04/02/2015 10:09 PM IST
Shyama charan gupta questions cancer link

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార పార్టీకి చెందిన ఎంపీలు రోజుకో రకమైన ప్రశ్నతో మంత్రులకు ఇబ్బందులను కొనితెచ్చిపెడుతున్నారు. ఆయన ప్రకటనలతో అటు కేంద్రంలోని ప్రభుత్వమే కాదు ఇటు దేశప్రజలు కూడా బెంబేలెత్తిస్తున్నారు. మొన్నటికి మొన్న ధూమపానం వల్ల కేన్సర్ వస్తుందని విదేశాలకు చెందిన పరిశోదనలే తేల్చాయని, దీనిపై ఎలాంటి స్పష్టత లేదని, భారతీయ వైద్యశాస్త్రవేత్తులు ఎవరూ దీనిని నిరూపించలేదని ఇటీవలబీజేపీ ఎంపీ, పొగాకు నిషేధం విధివిధానాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు దిలీప్ గాంధీ వ్యాఖ్యానించి వార్తలకెక్కారు.
 
తాజాగా, అధికార పార్టీకి చెందిన ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా ఆయనకు మద్దతు పలికారు. పొగాకు వినియోగానికి మద్దతు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ మధుమేహ వ్యాధిని కలుగజేసే చక్కెరపై నిషేధం లేనప్పుడు, క్యాన్సర్ కారకమని పొగాకును ఎలా నిషేధిస్తారని ప్రశ్నించారు. చక్కెర కన్నా బీడీలు అంత ప్రమాదకరం కాదని తేల్చిచెప్పారు. అయితే ఈ ఎంపీకి ఏదో అందరిలా సాధారణ ఎంపీ మాత్రే కాదు. కొన్ని వందల కోట్ల టర్నోవర్ గల సిగరెట్, బీడీ వ్యాపారాలకు అధిపతి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికల బోమ్మలను 40 శాతం నుంచి 85 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం మింగుడు పడక, సోంత పార్టీనే టార్గెట్ చేశారు. పొగాకు నిషేధం విధివిధానాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడు కూడా. అందుకే పొగాకు వినియోగానికి మద్దతు పలుకుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles