Gujarat | Antiterrorisom | Bill | President

Gujarat once again pass the bill of anti terrorism bill

gujarat, anti, terrorism, assembly, controversial, anandiben, president,

After failing to get Presidential assent for its anti-terror bill thrice, Gujarat government has again gone ahead and passed Gujarat Control of Organised Crime (GUJCOC) Bill in a new form in the Assembly . The new bill still retains some of the controversial provisions.

గుజరాత్ యాంటీ టెర్రరిజం బిల్.. ఈ సారైనా గట్టెక్కుతుందా..?

Posted: 03/31/2015 05:03 PM IST
Gujarat once again pass the bill of anti terrorism bill

గుజరాత్ అసెంబ్లీ మరోసారి వివాదాస్పద యాంటీ టెర్రరిజం బిల్లును ఆమోదించింది. బిల్లు చట్ట రూపం రావడానికి రాష్ట్రపతికి పంపిచింది గుజరాత్ అసెంబ్లీ. అయితే గుజరాత్ ఇలా ఇదే బిల్లును రాష్ట్రపతికి గతంలో మూడు సార్లు పంపించింది. కానీ రెండు సార్లు బిల్ తిరస్కరించగా, 2009లో పంపిన బిల్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. గతంలో 2004 లో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, 2008లో ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఈ బిల్ ను రాష్ట్రపతి పరిశీలన కు పంపింది. అయితే వివాదాస్సదంగా బిల్లులోని సెక్షన్ 14, 20 ల కింద చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గతంలోనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మరో సారి ఆనంది బెన్ నాయకత్వంలోని గుజరాత్ ప్రభుత్వం మరోసారి రాష్ట్రపతి పరిశీలనకు బిల్ ను పంపింది.

గుజరాత్ అసెంబ్లీలో బిల్ ను ప్రతిపాదిస్తు రజినీకాంత్ పాటిల్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. గుజరాత్ కంట్రోలర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ బిల్ 2015 ను గుజరాత్ అసెంబ్లీ ఏకపక్షంగా పాస్ చేసిందని విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రజా సంక్షేమం కోసం గుజరాత్ ప్రభుత్వం కొత్తగా బిల్లులో కొన్ని మార్పులను చేసి మరీ బిల్ ను తీసుకువచ్చిందని అధికారపక్షం అంటోంది. అయితే కీలకమైన సెక్షన్ 14, సెక్షన్ 20లలో ఎలాంటి మార్పులు చెయ్యకుండా మిగిలిన వాటిలో మాత్రమే మార్పులు తీసుకువచ్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఈ బిల్ గనక చట్ట రూపం దాలిస్తే, చట్టం ద్వారా అరెస్టు కాబడిన వ్యక్తి 180 రోజుల వరకు బెయిల్ పొందడానికి అవకాశం ఉండదు. నిందుతులుగా అరెస్టయిన వారు కేవలం ఎస్పీ స్థాయి వ్యక్తుల ముందు మాత్రమే వాంగ్మూలం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది,. సెక్షన్ 20(4) ప్రకారం స్వంతంగా పూచీకత్తుపై విడుదలకు అనుమతి లభించదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతి లేకుండా బెయిల్ ఇవ్వడం కుదరదు. ఇలా చట్టంలో ఉన్న లోపాలను గతంలో రాష్ట్రపతులు కూడా ప్రశ్నించారు. అయితే గుజరాత్ ప్రభుత్వం మాత్రం దానికి వేరే కారణాలను చెబుతోంది. మరి కనీసం ఈ సారైనా యాంటీ టెర్రరిజం బిల్ చట్టంగా మారుతుందో లేదో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gujarat  anti  terrorism  assembly  controversial  anandiben  president  

Other Articles