IT dept revealed names Indias 18 biggest tax defaulters | Gujarat companies

It dept revealed names indias 18 biggest tax defaulters

it department news, 18 biggest tax defaulters, tax defaulters list, income tax department, apple tech solutions, goldsukh trade india, blue information technology, somani cement company, jupiter business

IT dept revealed names Indias 18 biggest tax defaulters : The Income Tax department took to the strategy of 'naming and shaming' of some large tax defaulters as it published names of 18 entities who owe over Rs 500 crore tax to the exchequer. In this list 11 from Gujarat.

పన్ను ఎగవేతగాళ్లపై సరికొత్త పంథాలో ఐటీ ‘కొరడాదెబ్బ’

Posted: 03/31/2015 04:57 PM IST
It dept revealed names indias 18 biggest tax defaulters

పన్ను ఎగవేతగాళ్లపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ సరికొత్త పంథాలో కొరడా దెబ్బ కొట్టింది. ఇన్నాళ్లూ పన్ను కట్టకుండా తాపీగా వున్న కొన్ని కంపెనీల పరువు బజారులో కలిసిపోయేలా కొత్త విధానాన్ని అవలంభించింది. ఇటీవలే పన్ను ఎగ్గొట్టిన కొన్ని కంపెనీలకు ఐటీ నోటీసులు పంపించింది. ‘పన్ను కట్టనివారి పేర్లను వెల్లడిస్తాం.. పరువు పోతుందని భావిస్తే వెంటనే పన్ను కట్టండి’ అంటూ గతంలో హెచ్చరించినప్పటికీ.. సదరు కంపెనీలు ఐటీ శాఖలో తమ పన్ను కట్టలేదు కదా.. కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో ఎటువంటి పట్టింపులు లేకుండా చివరికి ఆదాయపు పన్ను శాఖ తన విధానాన్ని అనుసరించింది.

ఐటీ శాఖ ప్రస్తుతానికి రూ. 10 కోట్లకుపైగా పన్ను కట్టాల్సిన 18 మంది పన్ను ఎగవేతదార్ల పేర్లను, వివరాలను విడుదల చేసింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ జాబితాలో కేవలం ఒక్క గుజరాత్‌కు చెందిన సంస్థలే 11 ఉండటం గమనార్హం. ఇండియాలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన గుజరాత్.. అవినీతిలోనూ మొదటి స్థానంలో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ జాబితాలో సోమానీ సిమెంటు (27 కోట్లు), బ్లూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (75 కోట్లు), యాపిల్ టెక్ సొల్యూషన్స్ (27 కోట్లు), గోల్డ్‌సుఖ్ ట్రేడ్ ఇండియా (75 కోట్లు), జూపిటర్ బిజినెస్ (రూ. 21 కోట్ల) తదితర బడాసంస్థలు వున్నాయి. వీరంతా కలిసి దాదాపు 500 కోట్ల రూపాయల ఆదాయ పన్నును ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంది.

పన్ను ఎగవేతదార్ల పేర్లను ఆదాయ పన్ను విభాగం తన వెబ్‌సైట్‌లో గతంలోనే ఉంచింది. అయితే.. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఇలా బహిర్గతం చేసింది. ఇదే విషయమై ఓ ఐటీ అధికారి మాట్లాడుతూ... ‘పన్ను ఎగ్గొట్టిన కొందరిని ఎక్కడున్నారో తెలుసుకోవడానికి కష్టంగా ఉంది. వారందరికీ నోటీసులు పంపినప్పటికీ ఎటువంటి సమాధానం అందలేదు. అందుకే ఇలా పేర్లు వెల్లడించాల్సి వచ్చింది’ అని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Income Tax department  18 biggest tax defaulters  apple tech solutions  

Other Articles