hyderabad high court | ghmc elections | telangana sarkar

High court rejects to increase the time of ghmc elections

hyderabad high court, telangana high court, andhra pradesh high court, telangana government, ghmc elections, ghmc elections controversy, hyderabad city news

high court rejects to increase the time of GHMC Elections : Hyderabad High Court shocks to telangana government by giving latest statement on GHMC elections.

GHMC ఎన్నికల నిర్వహణపై టీ-సర్కారుకు షాకిచ్చిన హైకోర్టు

Posted: 03/30/2015 12:08 PM IST
High court rejects to increase the time of ghmc elections

ప్రజాసమస్యలను పరిష్కరించడంతోబాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల గడువు ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే! దీంతో ఈ ఎన్నికలు గడువు ముగిసినా ఇంకా నిర్వహించకపోవడాన్ని.. రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటిస్తూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ ఎలక్షన్స్ ఇంకా నిర్వహించకముందే ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ ఆయన ఈ ‘పిల్’లో పేర్కొన్నారు.

తాజాగా ఈ విషయంపై సోమవారం (30-03-2015) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికలు నిర్వహించేందుకు తమకు 249 రోజులు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ప్రస్తుతం వార్డుల పునర్విభజన జరుగుతోందని, అందుకు కొంతసమయం కావాలని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి కోరుతూ టీ సర్కార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఇటీవలే ఐఏఎస్ ల కేటాయింపు కూడా జరిగిందని కోర్టుకు టీ సర్కార్ వివరించింది. అయితే.. ఈ ఎన్నికల నిర్వహణకు అంత గడువు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలతో రావాలని, అన్ని అంశాలపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కోర్టు గడువు ఇవ్వకపోవడంపై సర్కార్ కాస్త నిరాశలో వున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad high court  ghmc elections  telangana sarkar  

Other Articles