sonia gandhi | all india congress committee | rahul gandhi

Sonia gandhi creates record in congress party history

sonia gandhi, sonia gandhi latest news, sonia gandhi updates, congress party news, congress party history, rahul gandhi, aicc latest updates, all india congress committee, sonia gandhi history

sonia gandhi creates record in congress party history : AICC president sonia gandhi creates a new record in party history. She is continue in this designation from 17 years.

చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సోనియా గాంధీ

Posted: 03/30/2015 07:57 AM IST
Sonia gandhi creates record in congress party history

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే! అయితే.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. అదేమిటంటే.. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షురాలిగా 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సోనియాగాంధీ.. ఆ పదవిని సుదీర్ఘకాలంగా నిర్వహిస్తున్న నేతగా రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ చరిత్రలో ఇంతకాలం ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరూ నిర్వహించలేదు.

1997లో కోల్కతాలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. అలా సభ్యత్వం తీసుకొన్న కేవలం 62 రోజులకే 1998లో ఆమె పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుంచి ఆమె పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మొదట 1999లో కర్నాటకలోని బళ్ళారి నుంచి, ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేశారు. బళ్ళారిలో సీనియర్ బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను ఓడించారు. అదే సంవత్సరం ఆమె 13వ లోక్ భకు ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. 2004, 2009,2014 సంవత్సరాలలో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.

అయితే.. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అతి తక్కువ మెజారిటీతో గెలుపొందింది. ఇదిలావుండగా.. సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పగ్గాలను ఈ ఏడాది వదిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే నెలలోనే పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  rahul gandhi  all india congress committee  telugu news  

Other Articles