56 percent turn out in maa elections | maa-elections

56 percent turn out in maa elections

maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema

56 percent turn out in movie artist association elections

ముగిసిన సినీ మా వార్.. 56గా నమోదైన పోలింగ్ శాతం

Posted: 03/29/2015 01:59 PM IST
56 percent turn out in maa elections

టాలీవుడ్ చిత్రపరిశ్రమలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. గతానికి భిన్నంగా ఇద్దరు ప్రముఖ సీనియర్ నటుల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు కోపసాగాయి. ఇద్దరు ప్రముఖులు పోటీపడుతుండటంతో ఎన్నికల పోలింగ్ శాతం నూరు శాతానికి చేరుతుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. కేవలం 56 శాతం పోలింగ్ మాత్రమే నమెదయ్యింది. మొత్తం 702 మంది మూవీ ఆర్టిస్టులు మాలో సభ్యులుగా వుండగా, కేవలం 394 మంది మాత్రమే ఓట్ల వేశారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందన్న వార్తలను జయసుథ ప్యానెల్ సభ్యుడు నరేష్ తోసిపుచ్చారు. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువగా ఓటింగ్ జరగలేదని ఆయన అన్నారు.

కాగా, ఓటింగ్ తక్కువగా నమోదు కావడంతో అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన నటకీరిటి రాజేంద్ర ప్రసాద్, సహజ నటి జయసుధల ఫ్యానల్ సభ్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రెండు ప్యానళ్లు.. ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా.. ఇంత తక్కువ సంఖ్యలో ఓట్ల పోలవ్వడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మీడియా విపరీత ప్రచారం.. ఇద్దరు సీనియర్ నటులు అధ్యక్ష పదవికి పోటీ పడటంతో.. ఎన్నికలకు అగ్రనటులు, నటీమణులు దూరంగా వున్నారని సమాచారం. కాగా ప్రోడ్యూసర్ కౌన్సిల్ కు ముందస్తు సమాచారం అందించి వుంటే.. ఇవాళ సెలవు దినంగా ప్రకటించి వుండేవారని, దీంతో మరింత పోలింగ్ నమోదై వుండేదన్న వార్తాలు వినబడుతున్నాయి

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  jayasudha  maa president elections  maa  

Other Articles