Nearly a month after Congress chief Sonia Gandhi granted 'leave of absence' from active politics to her son and party vice president Rahul Gandhi, posters declaring reward for any information on the missing Amethi MP have now come up in his Lok Sabha constituency.

Rahul gandhi missing posters surface in uttar pradesh

Rahul Gandhi, missing' posters, Uttar Pradesh, amethi

Rahul Gandhi missing' posters, Rahul Gandhi missing' posters surface in Uttar Pradesh, Rahul Gandhi missing' posters surface in UP, Congress chief Sonia Gandhi, Congress vice president Rahul Gandhi, Amethi MP Rahul Gandhi, Rahul posters surface in Allahabad and Bulandshahr, problems of UP, problems of Amethi lok sabha

రాహుల్ ఆచూకీ చెబితే రివార్డు.. పోస్టర్ల కలకలం..

Posted: 03/25/2015 11:56 AM IST
Rahul gandhi missing posters surface in uttar pradesh

క్రీయాశీలక రాజకీయ బాధ్యతల నుంచి తాత్కాలిక సెలవు తీసుకుని నెల రోజుల క్రితం వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తర్ ప్రదేశ్ లో పోస్టర్లు విడుదలయ్యాయి. ఆయన తప్పిపోయాడంటూ ఉత్తరప్రదేశ్లోని బాలందర్ష , అలహాబాద్ లతో పాటు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అమేధీ లోక్ సభ నియోజకవర్గంలో కూడా పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి. రాహుల్ తప్పిపోయారు.. రాహుల్ ఆచూకీ తెలిపిన, గుర్తించిన వారికి రివార్డులు కూడా ఇస్తాం అంటూ వాటిల్లో ప్రకటించారు. ఆయన సొంత నియోజకవర్గం ఆమేథిలో కూడా ఇవి కనిపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అత్యంత ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలను వదులుకుని రాహుల్ గాంధీ.. సెలవుపై వెళ్లడంతో విమర్శలు వినబడుతున్నాయి. ఒక పార్టీకి జాతీయ ఉపాధ్యక్షుడిగా వుంటూ.. బాధ్యతలను భుజస్కంధాలపై దించేయడం.. కీలక సమావేశాల సమయంలో సెలవుపై వెళ్లడం ఆయనకు తగునా..? అంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. దీంతొ అమేధీలో తమ నేత రాహుల్ గాంధీపై వున్న తమ భావాలను గేయం రూపంలో కూర్చి మరీ పాడుతున్నారు. 'జానే వో కౌన్సా దేశ్, జానే తుమ్ చలే గయే' ‘న చిట్టి న సందేశ్ కహా తుమ్ చలే గయే’ (నువ్వెక్కడికి వెళ్లావో ఎవరికీ తెలుసు, కనీసం ఉత్తరం లేదు, నువ్వెక్కడికి వెళ్లావో) అంటూ ప్రకటించారు.

అంతేకాదు..  అమేధిలోని ప్రజలు తాము ఎదుర్కోంటున్న పది ముఖ్యమైన సమస్యలను కూడా ఏకరువు పెట్టారు. అమేధీలో నాయకుడు లేడని, అభివృద్ది లేదని, తమ ప్రాంతాల్లోని పాడపోయిన రోడ్లను గురించి, రైతుల సమస్యల గురించి, మంచినీటి సమస్య గురించి, క్షీణించిన ఆరోగ్య వసతులపై విద్యార్థుల సమస్యలతో పాలు అనేక సమస్యలు జాబితా రూపాల్లో ప్లెక్సీల్లో పొందుపరిచారు. ఆయనతో పాటు బీజేపీ కేంద్ర మంత్రి ఉమా భారతి కూడా తప్పిపోయారంటూ వీరిద్దరు పలు వాగ్దానాలు చేసి వాటిని అమలుచేయకుండా తప్పించుకు తిరుగుతున్నారని వారు పేర్కొన్నారు. కాగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం వెనుక బీజేపి పాత్ర వుందని కాంగ్రెస్ నేతలు అరోపిస్తున్నారు. దేశంలో మార్పు తీసుకువస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ.. అమిత్ షాతో కలసి ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా మార్పు తీసుకువస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles