Cellar found in srirangam temple in tamilnadu

secret room in sri ranganatha temple, secret room in sri ranganathaswamy temple, sri ranganatha temple in trichy, sri ranganatha temple in tamilnadu, secret room in trichy sri ranganatha temple, secret room in trichy sri ranganathaswamy temple, sri ranganatha temple news, sri ranganatha swmay temple news, sri ranganatha swamyy temple location, sri ranganatha temple location

A cellar measuring 200 sq ft was found inside the eighth century Lord Ranganathaswamy temple here during renovation work, a senior official said today.

అనంతుడి తరువాత రంగనాథుడు.. రహస్యగదులు, నేలమాలిగలు..

Posted: 03/22/2015 06:02 PM IST
Cellar found in srirangam temple in tamilnadu

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలిగలలో అనంత సంపద వెలుగు చూసిన తరువాత తమిళనాడులోని శ్రీరంగనాథ ఆలయంలో మరో రహస్య గదిని ఆలయ అధికారులు కనుగోన్నారు, ఈ ఆలయంలో కూడా నేలమాళిగ ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఆలయంలో మరికొన్ని రహస్య గదులు, గుప్త నిధులు ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఆలయ సంపదపై అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించి.. తవ్వకాలు జరుపుతున్నారు. తిరుచ్చిలోని శ్రీరంగనాథుడి ఆలయంలో త్వరలో నిర్వహించనున్న కుంభాభిషేకం సందర్భంగా ఆలయ పునరుద్దరణ పనులు చేపట్టగా రహస్య గదులు, నేలమాలిగలు వెలుగు చేశాయి. ఈ నేపథ్యంలో ఆలయంలో వేణుగోపాల్ సన్నిధిని బండరాళ్లతో, మహా మండపం లోపల కుడివైపు గోడను మట్టితో నిర్మించిన విషయాన్ని గుర్తించారు.

మట్టిగోడపై ధన్వంతరి పెరుమాళ్ చిత్రం ఉంది. ఆ గోడను తొలగించారు. దీంతో రహస్య గది కనిపించింది. అది అయిదు అడుగుల వెడల్పు, ఇరవై అడుగుల పొడవుతో ఉంది. అందులో కొంత మట్టి, సున్నపు రాళ్లు, ఇటుకలతో నిర్మించిన నిచ్చెనలు కనిపించాయి. దీంతో నేలమాళిగ ఉండవచ్చునని అనుమానించారు. దానిని పరిశీలించాక ఓ బండరాయి కనిపించింది. దానిని తొలగించి చూడటంతో పన్నెండు అడుగుల లోతుతో నేలమాళిగ కనిపించింది. అందులో పరిశీలించగా.. ఏమీ కనిపించలేదు. కాగా, మరికొన్ని నేలమాళిగలు, గదులు ఉండవచ్చునని భావిస్తున్నారు. క్రీస్తు శకం పదో శతాబ్దంలో హొయసలరాజుల కాలంలో శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sri ranganatha temple  trichy  tamil nadu  

Other Articles