Speaker should be in favour of opposition says swami goud

Telangana legislature council chaiman swami goud, speaker should be in favour of opposition, swami goud, andhrapradesh asembly, oppsition, swami goud on ap assembly, swami goud on andhra pradesh assembly, swami goud comments on opposition, swami goud comments on speaker,

speaker should be in favour of opposition says Telangana legislature council chaiman swami goud

ప్రతిపక్షం వైవే సభాపతి సానుకూలంగా వుండాలి..

Posted: 03/22/2015 12:12 PM IST
Speaker should be in favour of opposition says swami goud

ప్రతిపక్షం వైపు సభాపతి సానుకూలంగా వ్యవహరించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ప్రతిపక్షం లేకుండా చట్టసభను నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. స్పీకర్ దృష్టి ఎల్లప్పుడూ ప్రతిపక్షం వైపే ఉండాలని సూచించారు. ప్రతిపక్షం లేవనెత్తే సమస్యలను పరిగణనలోకి తీసుకుని, వాటికి సరైన సమాధాలను అధికార పక్షం ఇచ్చేలా చేయడమే స్పీకర్ బాద్యతని పేర్కోన్నారు.

తద్వారా ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిస్కరించే విధంగా దోహదపడేందుకు సభాపతి చర్యలు తీసుకున్నట్లు అవుతుందని, అసెంబ్లీ సమావేశాలకు కూడా పరిపూర్ణత చేకూరుతుందని స్వామీ గౌడ్ పేర్కోన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం రాజేంద్రనగర్లోని పోలింగ్ కేంద్రంలో స్వామిగౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ శాసన సభలో అధికార పక్షంవారే ప్రశ్నించి, మళ్లీ అధికార పక్షం వారే సమాధానాలు చెప్పడం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగదని ఆయన వ్యాఖ్యానించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swami goud  andhrapradesh asembly  oppsition  

Other Articles