After malala another swat woman activist bags international award

Swat woman activist bags International Award, after malala yousufzai tabassum adnan bags fourageous award, malala and tabassum hail from militancy-infested Sawat Valley, pakistan woman recieves International Women of Courage Award, pakistan woman activist bags International Women of Courage Award, pakistan, sawat valley, 2015 Secretary of State’s International Women of Courage Award

Another women rights activist Tabassum Adnan from the scenic but militancy-infested Sawat Valley bagged 2015 Secretary of State’s International Women of Courage Award

పాకిస్థాన్ మరో ధీర వనితకు సాహస అవార్డు

Posted: 03/07/2015 09:07 AM IST
After malala another swat woman activist bags international award

పాకిస్థాన్‌లోని స్వాత్‌లోయ మరోసారి ప్రపంచం దృష్టిలో పడింది. స్వాత్‌ లోయలో తాలిబన్ల ప్రభావం అధికంగా వుండటంతో అక్కడున్న మగమహారాజులు భయంతో మనకెందుకు అంటూ వారి వారి కుటుంబాలను ఫోషించుకుంటూ జీవనం సాగిస్తుండగా, అక్కడ ధీర వనితలకు మాత్రం కోదవ లేదని మరో ఘటన రుజువు చేస్తోంది. తాలిబన్ల తూటాలకు ఎదురు నిలిచి.. బాలికల విద్యా హక్కుల కోసం ఉద్యమించిన పాకిస్థాన్ సాహస బాలిక, నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ తరువాత ఇదే లోయకు చెందిన మరో మహిళ కూడా సాహస మహిళ పురస్కారాన్ని అందుకుంది.

తాజాగా మహిళ హక్కుల కోసం పోరాడుతున్న ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యవస్థాపకురాలు తబస్సమ్ అద్నాన్‌కు అమెరికా విదేశాంగ శాఖ అంతర్జాతీయ సాహస మహిళ పురస్కారం-2015ను అందజేసింది. అద్నాన్‌కు 13 ఏళ్ల వయసులోనే వివాహమైంది. అయితే గృహహింస కారణంగా ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. అనంతరం స్వచ్ఛంద సంస్థను స్థాపించి మహిళల హక్కులు, పరువు హత్యలు, ఆమ్లదాడులు తదితర మహిళల అంశాలపై పోరాడుతుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tabassum adnan  International Women of Courage Award  women rights  

Other Articles