Private colleges warning to trs

privatecolleges, telanagana, mlc, mlc elections, scholarships,

telanagana private colleges association warned govt on up coming mlc elections. the assosiation members demand to release the scholarships to the colleges. the association having 50thousand vote bank that, they pressure on govt.

వారికి నోట్లు కావాలి.. వీరికి ఓట్లు కావాలి

Posted: 03/04/2015 03:55 PM IST
Private colleges warning to trs

కవిత్వానికి కాదేది అనర్హం అన్నాడు ఓ మహానుభావుడు, కానీ అదే ప్రాసలో కొన్ని మాత్రం నిజాలవుతున్నాయి. రాజకీయాలకు కాదేది అతీతం అన్నట్లు వ్యవహరిస్తున్నారు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ ల సంఘం నాయకులు. తమకు రావాల్సిన ఫండ్ ను వెంటనే విడుదల చెయ్యకపోతే, మా తడాఖా ఏంటో చూపిస్తాం అంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు సదరు సంఘం నేతలు. తమ పక్షానివి యాభై వేల ఓట్లు ఉన్నాయని, రానున్న శాసనమండి ఎన్నికల్లో తమ ప్రతాపాన్ని చూపించాల్సి వస్తుందని మందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కళాశాలల యాజమాన్యాలు విపరీతమైన బాధతో ఉన్నాయి. తెలంగాణ కోసం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సైతం పోరాడాయి. మా కళాశాలల్లోని అధ్యాపకులు సైతం ఈ పోరాటంలో పాల్గొన్నారు. కానీ తెలంగాణ వచ్చాక మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సహయపడుతున్నా.. విద్యా శాఖా మంత్రి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. గడ్డిపోచల్లాగా తీసేస్తున్నారు అంటూ తెలంగాణ ప్రైవేట్ కళాశాలల సంఘం నాయకులు అంటున్నారు. మరో పక్క తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కేజీ టు పీజీ పథకం అమలు తర్వాత జూనియర్‌ కళాశాలలు ఉండబోవంటూ మంత్రి బెదిరిస్తున్నారని సంఘం నేతలు తెలిపారు. మొత్తానికి తమకు రావాల్సిన డబ్బుల కోసం త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపెట్టారు సదరు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు. ఎలా ఐతే ఏమి ప్రభుత్వానికి ఓటు బ్యాంక్ ముఖ్యం, కళాశాలలకు ప్రభుత్వం సొమ్ము ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఓ మెట్టు దిగే అవకాశలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు అనుకుంటున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : privatecolleges  telanagana  mlc  mlc elections  scholarships  

Other Articles