Nirbhaya rapist interview on rajyasabha

nirbhaya, mukesh, rajyasabha, rajnathsingh, bbc, interview

Home minister Rajnath Singh on Wednesday made a statement in the Rajya Sabha on the issue of telecast of the controversial interview of Nirbhaya's rapist.

ఆ డాక్యుమెంటరీని అడ్డుకుంటాం.. లేదు ప్రసారం చేస్తాం..

Posted: 03/04/2015 01:36 PM IST
Nirbhaya rapist interview on rajyasabha

పెనం మీదనుంచి మంటలో పడినట్లుంది బిజెపి పరిస్థితి. నిన్నటి దాకా ప్రతిపక్షాలు భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తు చేసిన రాద్దాంతం అంతాఇంతా కాదు. సరే ఆ సమస్య ముగిసింది కదా అనుకుంటే నిర్భయ కేసులో నిందితుడి ఇంటర్వూ కొత్త వివాదాన్ని రేపింది. రాజ్యసభలో అధికారపక్షాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి విపక్షాలు. దేశం మొత్తం సంచలనాన్ని సృష్టించిన కేసులో నిందితుడు ఎలా ఇంటర్వూ ఇచ్చాడని వారు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ విషయంపై స్పందించిందని, దర్యాప్తు జరుగుతోందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజసభలో ప్రకటన చేసినా విపక్షాలు తమ ఆందోలనను విరమించుకోలేదు. మొత్తానికి బిజెపి పార్టీకి నిర్భయ కేసు నిందితుడి ఇంటర్వూ కొత్త తలనొప్పిని తెచ్చింది.

రాజ్ నాథ్ సింగ్ ఆ డాక్యుమెంటరీని అడ్డుకుంటామని ప్రకటన చేశారు. డాక్యుమెంటరీ షూటింగ్ లో చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన తెలిపారు. నిర్భయ కేసు నిందితుడు ఇలా బాహాటంగా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్యుమెంటరీని ప్రసారం చేస్తామని అంటున్నారు డాక్యుమెంటరీ నిర్మాతలు. మరోపక్క ఈ డాక్యుమెంటరీని బ్యాన్ చేస్తు ఢిల్లీ కోర్టు తీర్పు వెల్లడించింది. దాంతో నిర్మాతలు ఖంగుతిన్నారు. నిర్భయ తల్లిదండ్రులు డాక్యుమెంటరీని వ్యతిరేకించడంలేదని నిర్మాతలు అంటున్నారు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirbhaya  mukesh  rajyasabha  rajnathsingh  bbc  interview  

Other Articles