Pawankalyan postponed his tour

pawankalyan, twitter, janasena, ap, apcapital, cahndrababu, modi, nda-janasena, tdp-janasen

pawankalyan postponed his tour. janasena president pawan kalyan commeted to tour in the ap capital city villages on today. but certainly pawan tour postponed. may pawan will go for tour on march 5.

పవన్ పర్యటన వాయిదా.. మార్చ్ 5న జరిగే అవకాశం

Posted: 03/02/2015 10:48 AM IST
Pawankalyan postponed his tour

ఆరంభం కూడా కాలేదు అంతలోనే అపశకునం అన్నట్లుంది పవన్ కల్యాణ్ వ్యవహారం. ఏపి కి అన్యాయం జరుగుతోందని తన ట్వీట్టర్ లో పోస్ట్ చేసిన పవన్, రాజధాని గ్రామాల్లో పర్యటించాలని అనుకున్నా, అది వాయిదా పడింది. ఈ నెల 5వ తేదీన పవన్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. కాగా బడ్జెట్లో  ఏపీకి అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్విట్టర్ ద్వారా కాకుండా నేరుగా రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడతారనుకుంటే, అంతలోనే ఇలా పర్యటన వాయిదా పడింది. అయితే కొన్ని రోజులుగా పవన్ కళ్యాన్ తమ గోడును పట్టించుకోవాలంటూ రాజధాని గ్రామాలకు  చెందిన కొందరు నిరసనలు చేపట్టారు.

రాజధాని కోసం రైతులనుంచి పంట భూములను సమీకరించడంపై ట్విట్టర్‌లో పవన్ ఇటీవల తీవ్రంగా స్పందించడం తెలిసిందే. 'ఎంతో నమ్మకంతో ప్రజలు బీజేపీ-టీడీపీ కూటమిని గెలిపించారు. వారు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. రైతులు కన్నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. లేదంటే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపైనే ఉంది' అని పవన్ ట్వీట్ చేశారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawankalyan  twitter  janasena  ap  apcapital  cahndrababu  modi  

Other Articles