Mp minister wants law allowing people to keep lions tigers as pets

madhyapradesh, Kusum Mehdele, tigers, lions, thailand, africa, law, tiger reserves, tigers population, wild animal cencess

Animal Husbandry, Horticulture and Food Processing Minister Kusum Mehdele, in a proposal sent to the state's forest department, has cited legal provisions in some African and South-East Asian countries like Thailand which have helped bring about an increase in the population of the big cats.

పులులు, సింహాలు పెంపుడు జంతువులట..

Posted: 03/02/2015 10:29 AM IST
Mp minister wants law allowing people to keep lions tigers as pets

పులి అంటే భయపడని వారు ఎవరైనా ఉంటారా. పులి చుట్టు పక్కల తిరుగుతుందని తెలిస్తేనే అటు వైపు వెళ్లడం మానేస్తాం. పులైనా. సింహమైనా మనిషికి చచ్చేంత భయం. అవి జూ బోనులో ఉన్నా, దూరం నుండి చూస్తు ఆశ్చర్యపోతుంటాం. మరి ఇలాంటి భయంకర జంతువులను పెంపుడు జంతువులుగా పెంచుకునే అవకాశం ప్రజలకు కల్పించాలని ఎవరైనా అంటే ఏం చేస్తారు. అదేంటి ఇలా కూడా ఎవరైనా అడుగుతారా అనుకుంటున్నారా... అయినా ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.

పులులను, సింహాలను పెంచుకునేందుకు వీలుగా చట్టాలను మార్చాలని మధ్య ప్రదేశ్కు చెందిన ఓ మంత్రి వింత ప్రతిపాదన చేశారు. దేశంలో పులులు, సింహాల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నందున వాటిని సంరక్షించుకుంటూ వాటి సంతతిని వృద్ధి చేసేందుకు పెట్స్గా పెంచుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. మధ్యప్రదేశ్ లో యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా కుసుమ్ మెదాలే  పనిచేస్తున్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాలోని థాయిలాండ్ వంటి దేశాల్లో క్రూర మృగాలను పెట్స్గా పెంచుకునేలా చట్టాలు ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ మేరకు మన చట్టంలో కూడా మార్పులు తీసుకురావాలని కుసుమ్ మెదాలే అటవీశాఖకు లేఖలు రాయటం విశేషం. మధ్యప్రదేశ్ లో 6 టైగర్ రిజర్వ్స్ ఉండగా, వాటిలో 257 పులులు ఉంటున్నాయి. 2010 సంవత్సరం లో 1706గా ఉన్న పులుల సంఖ్య 2014 నాటికి 2,226కు పెరిగిందని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి పులులు, సింహాల సంఖ్యను ఇంకా పెంచాలంటే, ఇలా వాటిని పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని సదరు మంత్రి గారు అభిప్రాయపడుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kusum Mehdele  tigers  lions  tiger reserves  wild animal cencess  

Other Articles