New demand in congress that priyanka instead of rahul gandhi

rahul gandhi, priyankagandhi, congress, congress vice president, prime minister

new demand in congress that priyanka instead of rahul gandhi. earlier days congress vice president rahul gandhi took leave for couple of weeks. some congress goup demand to bring priyanka instead of rahul gandhi.

రాహుల్ జావో, ప్రియాంక లావో.. కాంగ్రెస్ లో కొత్త నినాదం

Posted: 02/27/2015 10:32 AM IST
New demand in congress that priyanka instead of rahul gandhi

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రి కుర్చీని అందుకోలేకపోయింది. కనీసం తన కొడుకు, భవిష్యత్తులో పార్టీని చూసుకోవాల్సిన రాహుల్ గాంధీకైనా ఆ కుర్చిని అందించాలని అనుకుంది. కానీ రాహుల్ గాంధీకి ఆ అవకాశం అస్సలు రాలేదు. యుపిఎ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. దాంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై గుసగుసలు మొదటయ్యాయి. కొందరు కాంగ్రెస్ నాయకులే, రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ బాబు పర్యటించిన ఒక్క చోట కూడా కాంగ్రెస్ కు కలిసి రాలేదని, సెంటిమెంట్ చెబుతున్నారు. పాపం రాహుల్ దురదృష్టమో, మోదీ అదృష్టమో ప్రధాని పీఠం రాహుల్ కు అందనంత దూరానికి వెళ్లింది. అయితే ఎన్నికల సమయం నుండి రాహుల్ కొంత అసహనంగా ఉన్నారని కొందరు దగ్గరి వారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అపజయాన్ని తనకు ఆపాదించడాన్ని రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారని వారి వాదన.

అందుకే తాజాగా రాహుల్ బాబు కొంత కాలంపాటు సెలవు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చ మొదలైంది. అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి ఇది అందివచ్చిన అవకాశం. ఇంతకంటే మంచి అవకాశం బహుశా మళ్లీ రాదేమో. అందుకే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిపై సెటైర్ లు వేస్తున్నారు బిజెపి నాయకులు. గత రెండు రోజులుగా జరుగుతున్న పలు ర్యాలీలు, నిరసనల్లో రాహుల్ గాంధీ కనిపించడం లేదు, ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషకం ఇవ్వబడును అంటూ పోస్టర్లు వెలిశాయి. జూనియర్ గాంధీ కనిపించడం లేదని, రాజకీయ సన్యాసి రాహుల్ అంటూ ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు రాహుల్ వ్యవహారాన్ని రోడ్డుకీడుస్తున్నారు.

ఇదిలా ఉంటే మరి కొందరు కాంగ్రెస్ నాయకులు మాత్రం నిన్నటి దాకా ప్రియాంకా లావో కాంగ్రెస్ బచావో అన్న వారు, తాజాగా రాహుల్ జావో, ప్రియాంక లావో అంటూ కొత్త నినాదానికి తెర తీశారు. ప్రియాంక గాంధీ నాయకత్వంలొ కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని కాంగ్రెస్ లో ఓ వర్గం భావన. కానీ రాహుల్ ప్రస్తుత పరిస్థితిని కాంగ్రెస్ నాయకులే ఇలా వాడుకోవడం ఏంటని కొందరు రాజకీయ విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. మొత్తానికి రాహుల్ బాబు సెలవు వ్యవహారం కాంగ్రెస్ పార్టీ లోనూ తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  priyankagandhi  congress  congress vice president  prime minister  

Other Articles