Mufti mohammed invites pm modi

Mufti Mohammed, Pdp, Bjp, Modi, JammuKashmir, Elections, CommonMinimumProgrammee, Article370

PDP patron Mufti Mohammed Sayeed on Friday met Prime Minister Narendra Modi and invited him for the swearing-in ceremony of the PDP-BJP alliance government in Jammu and Kashmir. After the meeting, Sayeed said that Modi has agreed to attend the function to be held at the Zorawar auditorium in Jammu.

మోదీని ఆహ్వానించిన ముఫ్తీ మహ్మద్.. మార్చ్ 1 న ప్రమాణ స్వీకారం

Posted: 02/27/2015 11:40 AM IST
Mufti mohammed invites pm modi

జమ్ము కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. పిడిపి-భాజపా పార్టీలు కలిసి జమ్ము కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా భాజపా పిడిపితో గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతూ వచ్చింది. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ లో ప్రత్యేక ఆర్మీ అధికారాలను తొలగించాలని, ఆర్టికల్ 370 ని రద్దు చెయ్యాలని పిడిపి డిమాండ్ చేస్తోంది. అయితే 370 ఆర్టికల్ వషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. రాజ్యాంగ పరిధిలొని అంశాన్ని అంత త్వరగా తేల్చలేమని గతంలోనే తేల్చింది. అయితే తాజాగా పార్లమెంట్ సమావేశాల్లోనూ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జమ్ము కాశ్మీర్ విషయంలో ప్రస్తుతం ఉన్న ఆర్టికల్ ను ఉపసంహరించుకోవడం కుదరదని తెలిపింది.

తాజాగా జమ్ము కాశ్మీర్ లో కొత్త ప్రభుత్వఏర్పాటుకు పూర్తిగా సానుకూలంగా ఉన్నా, మోదీతో చర్చలు ఓ కొలిచ్చి వస్తే గానీ తేలదని పిడిపి వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఫ్తి మహ్మద్ మోదీతో భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే భాజపాతో ఒప్పందం కుదిరిన తరువాతే ప్రభుత్వ ఏర్పాటుకు పిడిపి ముందుకు వచ్చిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
జమ్ములో బిజెపి ఎక్కువ స్థానాలను సాధించగా, కాశ్మీర్ లో పిడపి ఎక్కువ స్థానాలను స్వంతం చేసుకుంది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పటుకు సిద్దంగా ఉన్నాయని ముఫ్తీ మహ్మద్ వెల్లడించారు. వచ్చే ఆదివారం జమ్ముకాశ్మీర్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా రానున్నట్లు ఆయన తెలిపారు. రెండు పార్టీలు కలిసి పని చేసే అవకాశం వచ్చిందని, అందుకే భాజపా, పిడిపి పార్టీలు కలిసి జట్టుగా పని చెయ్యాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ గురించి త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

ముఫ్తీ మహ్మద్ తొమ్మిది సంవత్సరాల తర్వాత మరోసారి జమ్ము కాశ్మీర్ పగ్గాలను చేపట్టనున్నారు. గతంలో కాంగ్రెస్ సపోర్ట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఫ్తీ మహ్మద్ ఈ దఫా బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆదివారం ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహ్మద్ తో పాటు 14 మందితో కూడిన మంత్రి మండలి ప్రమాణ స్వీకారానికి సిద్దపడుతున్నట్లు సమాచారం.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mufti Mohammed  Pdp  Bjp  Modi  JammuKashmir  Elections  CommonMinimumProgrammee  Article370  

Other Articles