Ed attaches rs 232 crore assets of jagan

jagan, ys rajshekar reddy, ysrcp, sakshi,jajani infra, indira television, enforcement directotate

the Prevention of Money Laundering Act (PMLA) to probe alleged bribes paid by Srinivasan, also the Managing Director of Ms India Cements Limited, to Reddy as "quid-pro-quo for undue favours received by his company from the government of Andhra Pradesh" when Jagan's father YS Rajasekhara Reddy was the state Chief Minister.

జగన్ కు ఝలక్.. 232 కోట్లు సీజ్

Posted: 02/26/2015 04:03 PM IST
Ed attaches rs 232 crore assets of jagan

మనీలాండరింగ్‌ కేసులో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు మరో ఝలక్‌ తగిలింది. అక్రమాస్తుల కేసులో రూ.232 కోట్లను ఈడీ సీజ్‌ చేసింది. జగన్‌ ఇన్‌ఫ్రా, ఇండియాసిమెంట్స్‌ ఆస్తులను ఈడీ అలాచ్‌మెంట్‌ చేసింది. ఎన్నికల సమయానికి కొన్ని రోజుల క్రితం వరకు జైల్లో ఉన్న జగన్, ఎన్నికల సమయానికి బయటకు వచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా ఇండియాసిమెంట్స్‌కు చెందిన రూ.232 కోట్లు విలువ చేసే కడప, విశాఖ, బెంగళూరు, పంజగుట్టలోని ఆస్తులను ఈడీ అటాచ్‌మెంట్‌ చేసింది. జనని ఇన్‌ఫ్రా ఆస్తుల్లో కడప జిల్లాలోని తాడిగొట్లలో 2.11 ఎకరాల భూమి, విశాఖ మధురవాడలోని 1.97 ఎకరాల స్థలం, బెంగళూరు వగత విలేజ్‌లోని 2.3 ఎకరాల భూమి,  పంజాగుట్టలో 886 చదరపు అడుగుల భవనం అటాచ్‌మెంట్ చేశారు. బంజారాహిల్స్ విజయా బ్యాంకులోని రూ. 96 కోట్ల డిపాజిట్లు, ఇండియా సిమెంటుకు చెందిన రూ. 86 కోట్లు విలువ చేసే త్రినేత్ర సిమెంటు కంపెనీ షేర్లు, కోరమాండల్‌కు చెందిన రూ. 20 కోట్ల డివెంచర్లు అటాచ్‌ చేశారు. వాటితో పాటు ఇందిరా టెలివిజన్‌లోని రూ.10 కోట్ల షేర్లు, ఇండియా సిమెంట్స్‌కు సంబంధించి త్రినేత్ర సిమెంట్స్‌ షేర్ల పేరిట ఉన్న రూ. 10 కోట్లు, కార్మెల్ ఏషియాకు చెందిన రూ. 3 కోట్లు, కార్మల్ ఏసియాకు సంబంధించి ఇందిరా టెలివిజన్‌లో ఉన్న రూ. 25 లక్షల షేర్లు ఈడీ అటాచ్‌మెంట్‌ చేసింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagan  ys rajshekar reddy  ysrcp  sakshi  jajani infra  indira television  enforcement directotate  

Other Articles