Dogs marriage

vellur, hindhu mahasabha, dogs marriage

vellur hindu mahasabha arrange a marriage between two dogs. the hindu mahasabha oppose to calebrate valentiens day.

అది చెప్పడానికి శునకాలకు పెళ్లి చేశారు..!

Posted: 02/11/2015 12:09 PM IST
Dogs marriage

మీడియాలో ప్రచారానికి కొంత మంది వింత వింత చేష్టలు చేస్తుంటారు. తాము చెప్పాలనుకున్న  విషయాన్ని కాస్త డిఫరెంట్ గా చెప్పే వారిపైనే మీడియా ఫొకస్ ఉంటుంది. అర్ద నగ్న ప్రదర్శనలు, ర్యాలీలో వివిధ రకాల కార్టూన్ బొమ్మలు, ఫ్లెక్సీలు, రకరకాల వేషధారణలు ఇలా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా రొటిన్ కు భిన్నంగా చేస్తుంటారు. కొన్ని సార్లు మీడియాలో ఎంతో హైలైట్ అవుతూ, రాత్రికిరాత్రే ఫేమస్ అవుతారు.

తాము చెప్పాలనుకున్న మ్యాటర్ ను సూటిగా చెబితే ఎవరు పట్టించుకుంటారులే అనుకున్న కొంత మంది వేలూరు హిందు మహాసభ కార్యకర్తలు శున కాలకు వివాహం చేశారు. ఇంతకీ వీరు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రేమికుల రోజును జరుపుకోరాదని, ఒక వేళ ఆ రోజు ఎవరైనా ప్రేమికులు కనిపిస్తే తాళిబొట్టు ఇచ్చి పెళ్లి కూడా చేస్తామని తెలిపారు. మొత్తానికి ప్రేమికుల రోజును నిరసిస్తు ఇలా శునకాలకు పెళ్లి చేయడం వార్తలకెక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vellur  hindhu mahasabha  dogs marriage  

Other Articles