It notice to aap

aap, aap donations, i.t, it notice, unknown companies

it offiacials sent a notice to aap. stats of donations in this elections. bjp annonce that aap collet donations from unknown companies.

లెక్కలు చూపాలంటూ ఆప్ కు ఐటి నోటీసులు

Posted: 02/11/2015 12:10 PM IST
It notice to aap

ఎన్నికల్లో ఎంత ఖర్చు చేసినా దానికి లెక్కలు ఉండాలి. భారత ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ప్రకారం అభ్యర్థులు ఖర్చు చెయ్యాలి. అలా కాదని ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు చేసినా ఎక్కిక చెల్లదు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నం. ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఖర్చు చేస్తారో వారికే విజయావకాశాలు ఎక్కువ అన్న భావన చాలా పార్టీలకు ఉన్నాయి. ఇక పార్టీలకు అందే విరాళాల లెక్కల ఎన్నికల కమీషన్ కు చూపించాల్సిందే.  అన్ని జాతీయ పార్టీలు కోట్ల రూపాయల విరాళాలను సేకరిస్తున్నాయి. దానికి తగ్గట్టు డబ్బులకు తగిన లెక్కలను కూడా చూపుతున్నాయి.

తాజాగా ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిధులపై ఐటి నోటీసులు జారి చేసింది. ఈ ఎన్నికల సందర్భంగా పార్టీకి వచ్చిన డొనేషన్ల వివరాలను తెలపాలని కోరింది. ఈ నెల 16 లోగా తమ లేఖకు సమాధానం ఇవ్వాలని ఐటి లేఖలో పేర్కొన్నారు. అయితే ఆప్ కు వచ్చిన రెండు కోట్ల రూపాయలు అక్రమంగా వచ్చి చేరినవే అంటూ ఎన్నికల సందర్భంగా బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. ఎలాంటి వ్యాపార లావాదేవిలు లేదని కంపెనీల నుండి డబ్బు పార్టీకి చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్నే రేపాయి. కాగా బిజెపి కావాలనే ఐటి చేత నోటీసులు ఇప్పించిందంటూ అప్పడే విమర్శలూ వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aap  aap donations  i.t  it notice  unknown companies  

Other Articles