Arvind kejriwal anna hazare bjp advertisement controversy

arvind kejriwal latest news, bjp party controversy advertisement, kill anna campaign ad, bjp campaign ad, anna hazare latest news, bjp party news, arvind kejriwal controversy

arvind kejriwal anna hazare bjp advertisement controversy : aap president anna hazare demands bjp party to say sorry for making advertisement against them in which flowers covered to anna hazare photos.

‘అన్నా హజారే’ను చంపేసిన బీజేపీ.. ఖంగుతిన్న కేజ్రీవాల్!

Posted: 01/30/2015 03:54 PM IST
Arvind kejriwal anna hazare bjp advertisement controversy

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ పోటీబరిలో వున్న ప్రధాన పార్టీలు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకరిపైమరొకరు తిట్లపురాణం సంధించుకోవడం వరకు బాగానే వుంటుంది కానీ.. మరీ హద్దుదాటితే తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ ప్రదర్శించిన తీరు చూస్తే.. ప్రతిఒక్కరు నోళ్లవేళ్లబెట్టుకోక తప్పదు. బతికే వున్న అన్నాహజారేను చనిపోయినట్లుగా చూపించడం సంచలనంగా మారింది.

ఎన్నికల నేపథ్యంలో ప్రచారకార్యక్రమాల్లో మునిగిపోయిన బీజేపీ పార్టీ.. ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేస్తూ దానికి వ్యతిరేకంగా ప్రకటనలను ఇస్తోంది. ఇందులో కేజ్రీవాల్’ని టార్గెట్ చేస్తూ.. గతేడాది ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తీసుకోవడంపై విమర్శనాస్త్రాలను సంధించింది. అలాగే ‘‘అధికారం కోసం పిల్లలపై ఒట్టువేసి మరీ అబద్ధాలు చెబుతాను’’ అంటూ కేజ్రీ అన్నట్లుగా బొమ్మను ప్రదర్శించారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. ఈ యాడ్’లో అన్నాహజారే చిత్రాన్ని ఉపయోగించి, దానికి పూలమాలవేసి వున్నట్లుగా చూపించింది. హిందూసంప్రదాయం ప్రకారం చిత్రపటానికి పూలమాలవేస్తే సదరు వ్యక్తి చనిపోయినట్లని అర్థం! అంటే.. ఈ ప్రకటనలో బీజేపీ ‘అన్నా’ చనిపోయినట్లుగా చూపించిందన్నమాట!

Arvind-Tweet

ఈ ప్రకటనను వీక్షించిన అనంతరం కేజ్రీవాల్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ముఖ్యంగా అన్నా చిత్రపటానికి వేసిన పూలమాలను చూసి ఆయన ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీంతో ఆయన బీజేపీ పార్టీపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హజారే చనిపోయినట్లుగా చూపిన చర్యకుగానూ బీజేపీ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజానికి హిందూ సంప్రదాయాల ప్రకారం చనిపోయిన వారి చిత్రాలకు మాత్రమే పూలదండలు వేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీ మాట్లాడుతూ.. ‘‘1948లో నాథూరాం గాడ్నే గాంధీజిని చంపాడు. ఈరోజు బీజేపీ తన ప్రకటనలో అన్నాను చంపింది. ఇందుకు బీజేపీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే’’ అని ఆయన డిమాండ్ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal latest news  bjp kill anna campaign ad  anna hazare news  

Other Articles