Hyderabad high court rejected habeas corpus act

hyderabad high court, high court of andhra pradesh, telangana high court, habeas corpus act, karimnagar district news, habeas corpus act latest news, illegal affair, wife illegal affairs, husband illegal affairs

hyderabad high court rejected habeas corpus act : the high court of hyderabad rejected habeas corpus act which is lodged by karimnagar man. In this act the person requests to bring back his wife who is living with other person.

‘మీ లొల్లేదో మీరే చూసుకోండి’ : హైకోర్టు

Posted: 01/30/2015 02:54 PM IST
Hyderabad high court rejected habeas corpus act

ఇటీవలకాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. భార్య మరొకరితో సంబంధం పెట్టుకుందని భర్తలు పిర్యాదు చేస్తే.. ఇదే తరహాలో భార్యలు కూడా కంప్లైంట్లు చేయడం ఎక్కువయిపోయాయి. ఈ నేపథ్యంలోనే కరీంనగర్’కు చెందిన ఒక వ్యక్తి.. మరో వ్యక్తితో కలిసి వున్న తన భార్యను తనకు అప్పగించాలంటూ హైదరాబాద్ హైకోర్టులో ‘హెబియస్ కార్పస్ రిట్’ను దాఖలు చేశాడు. దీనిపై విచారించిన కోర్టు.. కొన్ని ఆసక్తికరమైన ఆదేశాలను జారీ చేసింది.

భార్యాభార్తలు కలిసి జీవితాంతం కాపురం చేయాలని తాము ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తుల నిర్బంధంలో వున్నవారిని కోర్టులో హాజరుపరచాలని చెప్పలేమని తెలిపింది. అసలు ఈ వ్యవహారం హెబియస్ కార్పస్ పరిధిలోకి రాదని కోర్టు చెప్పింది. భార్యాభర్తలపై కాపురంపై అధికారం చెలాయింటే హక్కు కోర్టుకు లేదని వ్యాఖ్యానించింది. అయితే.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా పోలీసులు అక్రమంగా వ్యక్తులను నిర్బంధించిన సమయంలోనే ఈ పిటిషన్’ను పరిగణనలోకి తీసుకుంటామని కోర్టు వెల్లడించింది.

ఇక్కడ కోర్టు సారాంశం ఏమిటంటే.. భార్యాభర్తలు కలిసి జీవించమని చెప్పే హక్కు ధర్మాసనానికి లేదని, ఇద్దరూ స్వేచ్ఛగా తమ నిర్ణయాల మేరకు జీవితాన్ని ఆస్వాదించవచ్చని తెలుపుతోంది. అయితే.. మహిళలు మరొకరితో జీవితాన్ని ఆస్వాదించడంపై కోర్టు స్పందించలేదు కానీ.. అదే భర్త మరొక భార్యతో కలిసి వుంటే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది కోర్టు వెలువరించలేదు. మరి.. దీనిపై భవిష్యత్తులో కోర్టు ఎలా తీర్పునిస్తుందో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad high court  illegal affairs cases  habeas corpus act  

Other Articles