Quikr asked to explain ad about boy for sale for rs 5

Quikr.com, Boy for sale in Quikr.com, National Committee for protection of Child rights, Information Technology Ministry, Online classifieds, add in Quikr for sale of boy, chennai boy for sale, child for sale in chennai, boy for Rs 5, boy for Rs 5 in chennai, chennai rahul for sale,

country's major online classifieds website Quikr.com, has been asked to explain an ad that allegedly advertised sale of a boy for Rs. 5.

మగ బిడ్డ కావాలా..? క్వికర్ లో రూ. ఐదుకే అమ్మకం

Posted: 01/24/2015 09:25 AM IST
Quikr asked to explain ad about boy for sale for rs 5

అన్ లైన్ విక్రయాలను నిలిపివేయాలని ఓ వైపు భారత వ్యాపారులు గగ్గోలు పెడుతున్న తరుణంలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఆన్ లైన్ల్ అమ్మాకాలకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోంది. దేశంలో ఈ కామర్స్ రోజురోజుకు పుంజుకుంటున్న తరుణంలో ఆన్ లైన్ వ్యాపారాలు, క్రయవిక్రయాలపై ప్రభుత్వం నియంత్రణ అవసరమని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. దేశంలో సెకండ్ సేల్స్ సాగించే ఆన్ లైన్ వెబ్ పోర్టల్ లలో ఆగ్రగామిగా వున్న క్వికర్ డాట్ కామ్ లో అమ్మాకానికి పెట్టిన వస్తువు అందరి దృష్టిని ఆకర్షించింది.

అదేంటంటే కస్టమర్లు పెంపుడు జంతువులను క్రయవిక్రయాలు జరిపే సెక్షన్ లో ఓ బాలుడిని అమ్మాకిని పెట్టిన ఫోస్టు చూసి నెట్ జనులు షాక్ కు గురయ్యారు. అదేంటి దేశంలో బిడ్డల క్రయవిక్రయాలను చేయడం నేరంగా పరిగణిస్తుండగా, ఏకంగా తమ బిడ్డను అమ్మకానికి ఆన్ లైన్ వైబ్ పోర్టలో పెట్టడం ఏంటని నిరసనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ పోస్టింగ్ చెన్నై నగరం నుంచి వచ్చిందని తెలుస్తుంది. అయితే ఏదో పొరబాటుగా పెంపుడు జంతువు ఫోటో కి బదులు అబ్బాయి ఫోటో పెట్టారనుకుంటూ పోరబాటే.. ఎందుకంటే అమ్మకానికి అబ్బాయిని పెట్టినట్లు కూడా వారు బాహాటంగానే స్పష్టం చేయడం విమర్శలకు దారితీసింది.

ఏదో అర్ధిక ఇబ్బందుల కారణంగానో, మరో ఇతర కారణంగా అబ్బాయిని విక్రయిస్తున్నారని అనుకుంటే కూడా పోరబాటు. ఎందుకంటే అబ్బాయిని కేవలం ఐదు రూపాయలకే విక్రయిస్తున్నట్లు అక్కడ రేటును కూడా పొందుపర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కస్లమర్ల పోస్టులను మాడరేటింగ్ చేసే వారు కూడా ఈ పోస్టును గుడ్డిగా తమ సైట్ లోకి అనుమతించడంపై క్వికర్ యాజమాన్యంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విషయమై బాలల హక్కుల పరిరక్షణ సంఘం కేంద్రానికి కూడా పిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ క్విక్కర్ యాజమాన్యం నుంచి వివరణ కోరింది. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ నుంచి తమకు పిర్యాదు అందిందని, ఈ ప్రకటనపై వివరణ ఇవ్వల్సిందిగా తాము సదరు ఆన్ లైన్ వెబ్ సైట్ ను కోరామని తెలిపింది. అయితే ఆలస్యంగా మేల్కోన్న క్విక్కర్ యాజమాన్యం అంతర్గత దర్యాప్తుకు ఆదేశింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Quickr.com  boy for sale  chennai  Information Technology Ministry  

Other Articles