Haryana government gives yoga guru a special respect

haryana government, yoga guru a special respect, haryana brand ambassodor, India's first yogic state, haryana promote yoga, haryana promote ayurveda,

The BJP government in Haryana has appointed yoga guru Ramdev the state's brand ambassador. Haryana has ambitious plans to promote yoga and ayurveda in a big way.

యోగా గురువుకు ప్రత్యేక గౌరవానిచ్చిన హర్యానా సర్కార్

Posted: 01/16/2015 09:22 AM IST
Haryana government gives yoga guru a special respect

యోగా గురు బాబా రాందేవ్ కు హర్యానాలోని బీజేపి ప్రబుత్వం ప్రత్యేక గుర్తింపును కల్పించింది. కోట్ల మందికి తన యోగాతో, తన అయుర్వేద ఉత్పత్తులతో రోగాలకు చికిత్సనందిస్తున్న బాబా రాందేవ్ కు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. హరిద్వార్లోని దివ్య యోగా మందిర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ రాష్ట్ర క్రీడలు మరియు ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఈ విషయాన్ని మీడియా ఎదుట ప్రకటించారు.

యోగా గురువుకు ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడం ద్వారా తమ రాష్ట్రంలో వేలాది ఎకరాల ఖాళీ భూమిలో రాందేవ్ బాబా పర్యవేక్షణలో ఆయుర్వేద వనమూలికలను పెంచేందుకు కూడా తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బాబా రాందేవ్ ఆధ్వరంలో ఆ భూమిలో 25 వేల ఆయుర్వేద మొక్కలను నాటాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

హర్యానా ప్రభుత్వం తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల యోగా గురు బాబా రాందేవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే భారత్ దేశంలో తొలి యోగా రాష్ట్రంగా కూడా గుర్తింపు పోందుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమూల్యమైన అయుర్వేద విశిష్టత కలిగిన వన మూలికలను విరివిగా పెంచడం ద్వారా అనేక మందికి తమ ఉత్పత్తులు తక్కువ ధరకు కూడా లభ్యమయ్యే అవకాశముందని బాబా రాందేవ్ అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba Ramdev  Haryana's brand ambassador  

Other Articles