Supreme court gives green signal to cock fights

supreme court green signal to cock fight, supreme court green signal to sankranthi bird fight, Supreme court verdict on cock fight, supreme court permitted cock fights, supreme court, cock fight, sankranti cock fights in AP, BJP leader Raghuram Krishnam raju, green signal,

The Supreme Court of India on Monday has permitted for conduct of Cockfights in Andhra Pradesh. The Court dealing with a petition has permitted for conduct of cockfights for Sankranti.

‘సుప్రీం’ పచ్చజెండాతో కోడి పందాలకు సై.. సై సై..

Posted: 01/12/2015 01:45 PM IST
Supreme court gives green signal to cock fights

పోలీసులు, ఆంక్షలు దొంగచాటు నిర్వహణలు, భారీ ఎత్తున లంచాలు ఇవన్నీ సంక్రాంతి సంబరాలలో చోటుచేసుకునే సాధరణ అంశాలు. అయితే ఇప్పడీ ఇక ఉత్కంఠకు తెరపడింది. కోడి పందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇకపై కోడి పందాలు అధికారికంగా గ్రామాలలోనే నిర్వహించుకునే పనిలో గ్రామ సచివాలయాలు వున్నాయి. ఇదివరకు ఎన్నడూ లేని సరికొత్త జోష్ తో పండగ పర్వదినాలలో కోడి పందాలు జరగనున్నాయి.

కోడి పందాలను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.  ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ...సమస్యను పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

సంక్రాంతి పర్వదినాలలో మాత్రం కోడి పందాలకు అనుమతినివ్వాలని, ఇది కూడా తమ సంప్రదాయమని పిటీషనర్ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్ లో పిటీషనర్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కోళ్లకు కత్తి కట్టకుండా, బెట్టింగులకు పాల్పడకుండా కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును కోరారు.  పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కోడిపందాలకు అనుమతి ఇవ్వటంతో పందెంరాయుళ్లు హర్షం వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cock fights  supreme court  tdp mlas  andhra pradesh  sankranthi  green signal  

Other Articles