Latest case on jabardasth comedy show

Jabardasth comedy show, case on Jabardasth tv show, Jabardasth comedy show case, latest case on Jabardasth tv show, Jabardasth latest show, Jabardasth comedy show latest episode, Nagababu, Anchor Rashmi, Jabardasth Rashmi, Roja in Jabardasth, Jabardasth show controversy, telugu tv programmes, telugu tv shows, comedy programmes, telugu comedy videos

latest case on Jabardasth Comedy Show : Again case filed against Jabardasth tv show. fresh case filed on Jabardasth in Huzurabad of Karimnagar district. police filed cases on Nagababu, Roja, Rashmi and Seshu

జబర్దస్త్ పై మళ్ళీ కేసు, నాగబాబు, రష్మి పేర్లు

Posted: 01/10/2015 10:18 AM IST
Latest case on jabardasth comedy show

కాంట్రవర్సీగా మారుతున్న కామెడి షో ‘జబర్దస్త్’పై మరో కేసు నమోదయింది. ఈ మద్యే గౌడ సంఘం ప్రతినిధులు ఓ ఎపిసోడ్ లో వేణు చేసిన స్కిట్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలిసు కేసులు, వ్యక్తిగత దాడులు, దూషణలు, ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లయింట్లు అంటూ ఈ రచ్చ ఎలాగోలా ముగిసింది. ఇంతలోనే ప్రోగ్రాంపై మరో కేసు నమోదయింది. ఆ సారి కూడా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోనే కేసు నమోదు కావటం గమనార్హం. ఇక తాజా కేసు గురించి చూస్తే.., గతేడాది అక్టోబర్ లో ప్రసారం అయిన ప్రోగ్రాంలో ఓ స్కిట్ బ్రహ్మణ సామాజిక వర్గాన్ని కించపర్చేలా ఉందని తిమ్మాపూర్ కు చెందిన అంజిరెడ్డి అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.., టీవీ షోలో స్కిట్ చేసిన శేషు,సుధాకర్ తో పాటు, యాంకర్ రష్మీ, జడ్జిలు నాగబాబు, రోజాపై కూడా కేసులు నమోదు చేయాలని పోలిసులను ఆదేశించింది. దీంతో మరోసారి ఈ కామెడి షో వివాదాల చెంతకు చేరుతోందనిపిస్తోంది. ఇప్పటికే వల్గారిటీ ఎక్కువై, కడుపుబ్బా వచ్చే నవ్వుకు బదులు, వెకిలి నవ్వులు వస్తున్నాయని విమర్శలు మూటగట్టుకన్న జబర్దస్త్, ఈ తరహా కేసులతో మరింత దిగజారుతోంది. మరి తాజా వివాదం కాంప్రమైజ్ తో ముగుస్తుందా లేక కోర్టు విచారణ దాకా వెళ్తుందా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabardasth show  nagababu  Anchor Rashmi  

Other Articles