Music director chakri wife case on in law s family

Music director chakri death, music director chakri family problems, chakri death problems, chakri wife sravani, sravani harassment, sravani, Chakri wife Sravani, Chakri family members, Chakri death reasons, Sravani complaint on Chakri family members, Jublee hills police station, tollywood latest, domestic violene, woman harassment

Music director Chakri Wife case on In Law's family : Music director Chakri wife Sravani again raised voice against in-law's family members. Sravani complained with harrasment allegations againes in-law's family. jublee hills police filed case on chakri family members with his wife complaint

ITEMVIDEOS: చక్రిలేని శ్రావణికి అత్తింటి అరిగోస

Posted: 01/10/2015 10:02 AM IST
Music director chakri wife case on in law s family

దివంగత సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి కష్టాలు తీరటం లేదు. అత్తింటి వారి నుంచి శ్రావణికి వేధింపులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అత్తింటివారి వేధింపులపై శ్రావణి పోలిసులను ఆశ్రయించింది. దీంతో చక్రి కుటుంబ సభ్యులపై జూబ్లీ హిల్స్ పోలిసులు కేసు నమోదు చేశారు. తాజా సమాచారం ప్రకారం.., ఆడపడుచులతో పాటు అత్తింటివారి కుటుంబ సభ్యుల నుంచి ఆస్తికోసం వేధింపులు వస్తున్నట్లు తెలిపింది. కొట్టడంతో పాటు చిత్రహింసలు పెడుతున్నారని తెలిపింది. శ్రావణి ఫిర్యాదుతో స్పందించిన పోలిసులు అత్తింటికి చెందిన ఆరుగురిపై 498, 506 సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు.

చక్రి చనిపోయిన రెండ్రోజులకే అత్తింటి వేధింపులపై శ్రావణి హెచ్.ఆర్.సీ కి ఫిర్యాదు చేసింది. కనీసం బట్టలు కూడా వేసుకునే అవకాశం లేకుండా కప్ బోర్డులకు తాళాలు వేసుకుని, డెబిట్, క్రెడిట్ కార్డులను తీసుకున్నారని తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగానే, ఇప్పుడు మరో కేసు నమోదు కావటం గమనార్హం. సంగీత చక్రవర్తిగా అభిమానుల గుండెల్లో నిలిచిన చక్రి మరణం వెనక అవకాశాల కొరత ఉందని తెలిసి ఇండస్ర్టీ అంతా విచారం వ్యక్తం చేసింది. తాజాగా జరుగుతున్న కుటుంబ వివాదాలు చక్రి ఆత్మకు శాంతి లేకుండా చేస్తాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chakri death  Sravani  Chakri family problems  

Other Articles