Sunanda pushkar murder case accused found

Sunanda Pushkar case, Sunanda Pushkar death case, Sunanda Pushkar death accused, Sunil Sahab, sunil Sahab in Sunanda Pushkar case, Shashi tharoor in Sunanda Pushkar case, Sunanda Pushkar mystery, Sunanda Pushkar case status, Delhi police on Sunanda Pushkar

Sunanda Pushkar Murder case accused found : Delhi police came to know in enquiry that Sunil Sahab is main accused person in Sunanda murder case. Domestic help says that sunil sahab stayed two days in hotel before her death.

సునంద కేసులో కీలక నిందితుడు దొరికాడు

Posted: 01/09/2015 10:45 AM IST
Sunanda pushkar murder case accused found

సంచలనం రేపిన సునంద పుష్కర్ హత్య కేసులో ఢిల్లీ పోలిసులకు ఆధారాలు లభిస్తున్నాయి. కేసును కీలకంగా తీసుకుని విచారిస్తున్న ప్రత్యేక ధర్యాప్తు బృంద పోలిసులు, సునంద ఇంటి పనిమనిషి నారాయణ సింగ్ ను ప్రశ్నించారు. పోలిసుల విచారణలో నారాయణ ముఖ్యమైన సమాచారం అందించాడు. సునంద చనిపోవటానికి రెండ్రోజుల ముందుగా ఆమెతో లీలా హోటల్ లో సునీల్ సాహబ్ అనే వ్యక్తి ఉన్నట్లు చెప్పాడు. దీంతో సునీల్ కు హత్యపై సమాచారం తెలిసి ఉండవచ్చని పోలిసులు అనుమానిస్తన్నారు.

అయితే సునీల్ ఎవరు, రెండ్రోజుల పాటు సునంద గదిలో ఎందుకు ఉన్నాడు అనే ప్రశ్నలకు నారాయణ సింగ్ చెప్పలేకపోయాడు. పనిమనిషి చెప్పిన సమాచారం ప్రకారం.., సునీల్ కోసం గాలింపు వేగవంతం చేశారు. గతంలో సునంద ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా అకౌంట్ల నిర్వహణ విషయాల్లో సునీల్ కీలకంగా వ్యవహరించాడని సమాచారం సేకరించారు. హత్యకు రెండ్రోజుల ముందు వరకు సునందతో ఉండి.., ఘటన జరిగిన తర్వాత కన్పించకుండా పోవటంతో పోలిసులు ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ కీలక నిందితుడు కావచ్చని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunanda Pushkar  Sunil Sahab  Shashi tharoor  

Other Articles