Rajapaksa defeat in sri lanka president elections

Sri Lanka Elections, Rajapaksa defeat, Mahinda Rajapaksa, Maithripala Sirisena, Rajapaksa losses Presidential Elections, Temple Trees, Sri Lanka Supreme Court, Sri Lanka new President Mithripala Sirisena

Rajapaksa defeat in Sri Lanka President Elections : Sri Lanka President Rajapaksa defeated in elections, agrees that people expected change in government. Sirasena going towards victory in Sri Lanka President Elections. Rajapaksa hatrick victory dream fade out with Maithripala Sirisena

లంకలో రాజ ( రాక్షస) పాలనకు ముగింపు

Posted: 01/09/2015 10:28 AM IST
Rajapaksa defeat in sri lanka president elections

శ్రీలంకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దశాబ్దం పాటు పాలించిన రాజపక్సేకు ప్రజలు ఇంటిదారి చూపించారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇవాళ జరిగిన కౌంటింగ్ లో ప్రతిపక్ష నేత మైత్రిపాల సిరసేన గెలుపొందారు. పరాభవంను అంగీకరిస్తూ.., అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్ళిపోయారు. తుది ఫలితాలు వెల్లడి కాకపోయినా.., సిరసేన నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఆధిక్యంను బట్టి అర్థమవుతోంది. రాజపక్స సన్నిహితులు, ముఖ్య అనుచరులు కూడా ఓటమిని అంగీకరించారు.

ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాజపక్స సన్నిహితులు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలుస్తోందన్నారు. అటు సిరసేన ఆధిక్యంతో ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి. కొలంబో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో విజయ ర్యాలీలు చేపడుతున్నారు. ఈ సాయంత్రం తుది ఫలితాలు వచ్చాక దేశాధ్యక్షుడిగా సిరసేన ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాజపక్స దశాబ్దపు పాలన రాక్షస యుగాన్ని తలపించిందనీ.., అందువల్లే ప్రజలు ఆయనకు స్వస్తి పలికారని ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు.

దేశానికి రెండు సార్లు అద్యక్షుడిగా ఎన్నికైన రాజపక్స హయాంలో ఎన్నో అవినీతి పనులు జరిగాయి. అంతేకాకుండా అసమర్ధ పాలన అందించారు. ఫలితంగా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నికలు జరగక ముందునుంచే ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తేలింది. తాజాగా ఫలితాలతో నిరూపితమైంది. శ్రీలంక తమిళుల ఊచకోత, ప్రధానంగా ఎల్టీటీఈ పై యుద్ధం విషయంలో ప్రపంచ దేశాల విమర్శలు  ఎదుర్కున్నాడు. ప్రజాస్వామిక దేశంలో నియంత తరహా పాలన అందించి చివరకు ఘోర పరాభవంతో ఇంటిదారి పట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajapaksa  Srilanka Elections  Maithripala Sirisena  

Other Articles