Mysoora reddy wants to quit ycp

mysoora reddy wants to quit YCP, mysoora reddy out of YCP, Mysoora reddy, Senior leader Mysoora Reddy, YCP not keen on mysoora Reddy, mysoora reddy un happy with jagan, Ycp mot implementing mysoora ideolgy, Dr.Mysoora Reddy, YCP leader Mysoora Reddy, mysoora differneces with jagan, kamalapuram constituency, EX MLA mysoora reddy, former minister mysoora reddy

mysoora reddy wants to come out from YCP as party is not giving him priority and not following his idealogies

త్వరలో వైసీపీ నుంచి మైసూరా అవుట్..?

Posted: 12/23/2014 08:31 PM IST
Mysoora reddy wants to quit ycp

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో విక్కెట్ ను కోల్పోనుందా..? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అతిపెద్ద, ఏకైక ప్రతిపక్ష పార్టీగా అవతరించిన పార్టీ తమ నాయకులను సంతృప్తిపర్చడంలో విఫలం అవుతోందా.? అంటే అవుననే సమాదానాలే వినిపిస్తున్నాయి. పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఒకొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. వైసీపీ పార్టీ అవిర్భావం నుంచి వున్న నేతలు.. ఇప్పుడు వైసీపీకి దూరం అవుతున్నారు. దీనికి కారణమమేమిటన్నది పక్కన బెడితే.. ఇప్పుడు తాజాగా మరో ముఖ్యనేత పార్టీ ముఖ్య సలహాదారు హోదాలో వున్న నేత కూడా వైసీపీకి దూరమవుతున్నారన్న వార్త వైసీపీ క్యాడర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

వైసీపీ పార్టీ అవిష్కరించే ముందు తన తండ్రి స్థానంలో వుండి బాబాయ్ లా పార్టీ బాధ్యతలను చూసుకోవాలంటూ తీసుకువచ్చిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి మైసూరారెడ్డిని కూడా జగన్ దూరం చేసుకుంటున్నారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీ ముఖ్యనేతగా, సలహాదారుగా వున్న మైసూరా రెడ్డిని, ఆయన సేవలను వినియోగించుకోవడంలో జగన్ విఫలమవుతున్నాడన్న వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే.. వైసీపీ అధినేత జగన్ కు అహంభావం ఎక్కువని, ఆయన పెద్దలకు కూడా గౌరవమివ్వరని చెప్పిన పలువురు నేతలు ఇతర పార్టీల వైపు పరుగులు తీశారు. పార్టీ పునాదుల నుంచి వున్న జూపూడి లాంటి నేతలు కూడా జగన్ బాటలో నడవలేకు మధ్యలోనే జారుకున్నారు.

ఇప్పుడు పార్టీ ముఖ్య సలహాదారుగా వున్న మైసూరా రెడ్డి కూడా అదే పనిచేయనున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. పార్టీని నడపడంలో సాయం కావాలని, ఎన్నికల తరువాత మైసూరారెడ్డిని, జగన్ పూర్తిగా పక్కకు పెట్టారని సమాచారం. ఈ నేపథ్యంలో మైసూరా కూడా వైసీపి నుంచి తప్పుకోనున్నారని సమాచారం. తన అభిమానులు, అనుయాయువులతో కలసి భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నారని తెలుస్తోంది. వారి నిర్ణయం మేరకు ఆయన నుడుచుకోనున్నారని సమాచారం. ముఖ్యనేత, పార్టీ సలహాదారు, తెర వెనుక కథ నడిపించే ధీరులు వైసీపీకి దూరమైతే.. పార్టీ కొంత ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. పార్టీ విషయంలో జగన్ ఒంటరిగా కాకుండా పెద్దల శక్తియుక్తుల్ని వినియోగించాలని, సలహాలూ సూచనలను పాటించాలని, పలువురు కార్యకర్తలు కోరుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mysoora Reddy  YSRCP  JaganMohan Reddy  

Other Articles