Jabardasth venu attacked by unknown persons in filmnagar

jabardasth venu attacked, comedian jabardasth venu attacked, comedian venu attacked, actor venu attacked, venu attacked in film nagar, comedian venu attack filmnagar, jabardast venu attack filmnagar, venu taken to hospital, venu hospitalised, comedian venu hospitalised, jabardast venu hospitalised

jabardasth venu attacked by unknown persons in filmnagar for perfoming goud community women role cheaply in jabardast show

హాస్యనటుడిపై ఫిల్మ్ నగర్ లో దాడి, అస్పత్రికి తరలింపు..

Posted: 12/21/2014 07:08 PM IST
Jabardasth venu attacked by unknown persons in filmnagar

బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు తెచ్చకున్న హాస్యనలుడు జబర్దస్త్ వేణుపై దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని అగంతకులు ఆయనపై దాడికి పాల్పడ్డారు.. నగరంలోని జూబ్లీహీల్స్ ఫిల్మ్ నగర్ మీదుగా వస్తున్న వేణును కొందరు గుర్తు తెలియన అగంతకులు పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి చేసినట్లు తెలుస్తోంది. దుండగుల దాడిలో వేణు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతడిని...స్నేహితులు చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా ఓ టీవీ షోలో గౌడ సంఘాన్ని కించపరిచే విధంగా స్కిట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుండగులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా శ్రామిక గౌడ మహిళా జీవన విధానాన్ని అవమానపర్చిన 'జబర్దస్త్' కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా  నాయకులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  ఈనెల 18న రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారమైన 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లు వృత్తిని, శ్రామికగౌడ మహిళా జీవన విధానాన్ని అవమానించే విధంగా స్కిడ్ ప్రసారం చేశారని, గతేడాది జూలై 11న కూడా 'జబర్దస్త్' లో కల్లుగీత కార్మికుల్ని ఘోరంగా అవమానించారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabardasth Venu attack  Apollo hospital  police complaint  gowda community  

Other Articles