We have done work even on sunday chandrababu naidu

Andhrapradesh chief minister chandrababu, Ap chief minister chandrababu, CM chandrababu, chandrababu in assembly, CM in assembly, chandrababu on hudhud in assembly, babu speech in assembly on hudhud, chandrababu speech on hudhud in assembly, chandrababu lashes opposition in assembly,

Ap cm chandrababu says government taken immidiate action at the time of hudhud and worked on relief measures even on sunday

చంద్రబాబు వ్యాఖ్యల మర్మమేమి మహాప్రభో..!

Posted: 12/20/2014 09:16 PM IST
We have done work even on sunday chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల మర్మమేమిటో రాష్ట్ర ప్రజానికానికి అర్థం కావడం లేదు. ప్రజాసేవ చేయడానికి మరోసారి అవకాశం కల్పిస్తే అహర్నిషలు రాష్ట్ర అభివృద్ది కోసం పాటుపడతానని ఎన్నకల ముందు ఊరూరా తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబు, ముఖ్యమంత్రి కాగానే మరో శైలిలో వ్యాఖ్యాలు చేయడం రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసింది. ఇంతకీ చంద్రబాబు వ్యాఖ్యల్లో మర్మమేమిటంటూ ప్రజలు నోటిపై వేళ్లేసుకుంటున్నారు. అధికారానికి ముందు చేప్పిన మాటలు, చేసిన బాసలు అన్ని ఆరుమాసాల్లోనే మర్చిపోయారా..? లేక ఎంతైనా తాము మనుషులమేనని, తమకు సెలవు రోజులు వుండాలని చెప్పుకోచ్చారా..? అన్నది ప్రజలకు అంతుచిక్కడం లేదు.

హుద్హుద్ తుపాను అంశంపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హుద్హుద్ తుపాను సమయంలో టీవీ దగ్గర కూర్చొని అందరం మానిటరింగ్ చేశామని చంద్రబాబు చెప్పారు. ఆదివారం అయినా అందరం కలసి పనిచేసి తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సాయం అందించడంలో ముందున్నామని చెప్పుకోచ్చారు. అంతేకాదు తుపానుపై ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేశామన్నారు. బలవంతంగా బాధితులను పునరావాస శిబిరాలకు తరలించడంతో పాటు  అక్కడి ఏర్పాట్లన్నిటినీ నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు.

తుపాను హెచ్చరికల కేంద్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు హఠాత్తుగా తమకు సమాచారం వచ్చిందని, దీంతో మచిలీపట్నం రాడార్ నుంచి సమాచారం తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు తుపాను వల్ల 160 నుంచి 170 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఊహిస్తే, 220 కిలోమీటర్ల వేగంతో తుపాను వచ్చిందన్నారు. తాను అదే రోజే బయలుదేరి విజయవాడ చేరుకున్నానన్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నానన్నారు. ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు మేం బాధ్యతగా ప్రవర్తించామన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఉత్తరాఖండ్ వరదలు సంభవించినప్పుడు విమానాలు పెట్టి బాధితులను సురక్షితంగా తీసుకువచ్చామని తెలిపారు.

చంద్రబాబు చేప్పిన విషయాలన్ని నిజమే అయినా.. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందునుంచి అప్రమత్తం చేసినా.. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే అయనతో పాటు పార్టీని ఇబ్బందులకు గురిచేసే పరిణామాలు వున్నాయి. అదివారం అయినా కూడా పనిచేశామని చెప్పడమే చంద్రబాబు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఎన్నికల ముందు ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిషలు పాటుపడతానన్న వ్యక్తి.. ముఖ్యమంత్రి కాగానే ఆదివారం అయినా కూడా పనిచేశాం అని యాధృఛికంగా అన్నారో.. లేక తెలిసే అన్నారో కాని ప్రజలు ఈ వ్యాఖ్యను తప్పబడుతున్నారు.

ప్రజా పాలకులుగా వున్నవారికి, అందులోనూ అధికార పార్టీకి అధినేత అయివుండి. చంద్రబాబు ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. ప్రజల బాగోగులు చూడాల్సిన పాలకులే అధికారాలు, పెలవు దినాలు అంటే.. ఎలా అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదివారం రోజున ప్రజలకు కష్టాలు వస్తే.. ప్రభుత్వం కాక మరెవరు స్పందిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో వుండగా ఒకలా, అధికారంలోకి రాగానే మరోలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు అలావాటేగా అనుకుంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chandrababu Naidu  AP Assembly  Hud hud Cyclone  

Other Articles