Mercury plunged down as cold waves grips ap and telangana

Mercury plunged down in AP, Telangana, cold waves grips ap and telangana, cold winds from north india, mercury plunged to lowest degree Celsius, winds continues for next few days, kowest temperatures, Telangana, Andhra pradesh, cold winds, northern india

Hyderabad experienced a nippy Thursday as the mercury plunged to 9.2 degree Celsius, the lowest since 2005. The Telangana government issued a cold wave warning in parts of the state, while the Met department said temperatures would continue to go down further over the next few days.

రెండు తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా!

Posted: 12/19/2014 10:08 PM IST
Mercury plunged down as cold waves grips ap and telangana

ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లని గాలుల ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఉష్ట్రోగ్రతలు కనిష్టస్థాయికి చేరాయి. చలిపులి దెబ్బకు తెలుగుప్రజలు గజగజలాడిపోతున్నారు. ఆదిలాబాద్‌లో 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు రోజు 8 డిగ్రీలు నమోదవగా ఒక్కసారిగా సగానికి పడిపోవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. 1897లో నిజామాబాద్‌లో 4.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైన తర్వాత ఇదే రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతలివి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల ఉష్ణోగ్రతల నమోదు రికార్డును పరిశీలించినా ఇదే అత్యల్పమని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌తోపాటు నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రామగుండంలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత గత పదిహేనేళ్లలోనే రికార్డు. 1912 జనవరి 14న ఇక్కడ 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరికొద్ది రోజుల్లో ఈ రికార్డూ చెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. మెదక్ పట్టణంలో దాదాపు 35 ఏళ్ల తరవాత డిసెంబరులో అత్యల్ప ఉష్ణోగ్రత 8.5 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో 12.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవడంతో నగర ప్రజలు అవస్థలుపడ్డారు. రెండు రోజుల్లో రాజధానిలో ఇంకా చలి పెరిగే అవకాశాలున్నాయి. తెలంగాణలో శీతలగాలులు మరింత బలంగా వీచే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి పెరుగుతోంది. కృష్ణా జిల్లా నందిగామలో 12.8, బాపట్లలో 17.7, రెంటచింతలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నందిగామలో డిసెంబరు కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. బాపట్లలోనూ 2005 తరవాత ఇదే అతి తక్కువ. రాయలసీమలోనూ చలి పెరిగిందని విశాఖపట్నం వాతావరణ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలలో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్టోగ్రత తగ్గుముఖం పట్టింది. విశాఖ ఏజన్సీలో చలి పంజా విసిరింది. ఉష్టోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం చలికి తట్టుకోలేక వణికిపోతున్నారు. అరకులో 7 డిగ్రీలు, చింతపల్లిలో 7, లంబసింగిలో 5, పాడేరులో 3 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cold wind  AP  Telangana  lowest temperatures  

Other Articles