Government officials caught at prostotution

Government officials caught at prostotution, Government officers at prostitution, Government officials illicit affairs, Government officials, illicit affairs, illegal money, prostitution, servants of the people

Government officials the direct servants to the people are held at prostotution and illicit affairs, is this due to illegally earned money

అధికారులే కామాంధకారులుగా మారుతున్నారా..?

Posted: 12/16/2014 03:20 PM IST
Government officials caught at prostotution

ప్రభుత్వ అధికారులు.. మరో విధంగా చెప్పాలంటే ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా..? లేదా అనేది పర్యవేక్షించాల్సింది వారే. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎవరికి వారు.. ఆయా స్థాయిలో పనులను పర్యవేక్షించాలి. అయితే ప్రభుత్వంతోనే తమకు పని అంటూ.. ప్రజలతో తమకేం పని అంటూ ప్రభుత్వ ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. ప్రజలంటే చులకన భావం.. కానీ వారు వివిధ రూపాల్లో చెల్లించే డబ్బునుంచే అధికారులకు, ఉద్యోగులకు జీతబెత్యాలు చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అన్ని విషయాలు తమకు తెలిసినా.. ప్రజలను ప్రభువులుగా చూడకుండా.. కేవలం ప్రభుత్వ పాలకులను మాత్రమే పాలకులుగా చూస్తుంటారు వీరు. ఈ క్రమంలో ఏదేనీ వ్యవహారాలపై ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ప్రజల ధనాన్ని మాత్రం జలగల్లా పీల్చుకు తింటుంటారు.

ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో దాచుకోవడాని బినామీలు అవతారం ఎత్తుతారు. ఇళ్లు, భూములు, నగలు, కార్లు, చేసే ఉద్యోగానికి, సంపాదించిన అస్తిపాస్తులకు సంబంధం లేకుండా లెక్కలేనంతగా సంపాదిస్తుంటారు. పేదలను వెయ్యి రెండు వేల కోసం రాచి రంపాన పెట్టే అధికారులు.. తీరా చూస్తే.. వారిని ముక్కు పిండు వసూలు చేసిన డబ్బును వ్యభిచారిణులకు తగలేస్తున్నారు. పేదవాడు రక్తాన్ని చమటగా మార్చి అర్జించిన డబ్బును.. కానీ కష్టం లేకుండా సంపాదించడంతో ..వాటిని సంపాదించేందుకు పడిన కష్టం విలువ తెలియని అధికారులు అప్పనంగా వచ్చిందని పక్కదారి పడుతున్నారు. విటులుగా మారుతున్నారు. అంతేకాదు తమ దిగువ స్థాయి మహిళా అధికారులను భయపెట్టో, ప్రలోభపెట్టో లొంగదీసుకుని తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో ఇలా దోరికిన అధికారుల జాబితా చెంతాడంత వున్నా.. ఇటీవలే మనకు ఉప్పల్ లోని ఓ వ్యభిచార కూపంపై పోలీసులు దాడి చేయగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారి ఒకరి అడ్డంగా పోలీసులకు చిక్కారు. కుకట్ పల్లి సర్కిల్ కు చెందిన ఒక అధికారి కూడా వ్యభిచార గృహంలో వున్నట్లు పోలీసులు చెప్పడం కలకలం రేపింది. అయనతో పాటు ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే అధికారి అనగానే ఏదో చోటా మోటా అధికారి అనుకోకండి.. డివిజనల్ ఇంజనీర్ స్థాయి గల అధికారి పట్టుబడటం సంచలనమే కదా. ఇదిలా వుంటే అంతకు ముందు ఒక సిఐ తన సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న ఓ మహిళా ఎస్ ఐ తో రాసలీలలు అడుతూ అడ్డంగా దోరికిపోయాడు. ప్రజలు ఇలా వుండకూడదు, అలా చేస్తే నేరం, చట్టం శిక్షిస్తుందని చెప్పాల్సిన పోలీసులే ఇలా అడ్డదారులు తొక్కుతుంటే.. ప్రజలకు రక్షణ ఎవరిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే వీటన్నింటికీ కారణం మాత్రం డబ్బేనని తెలుస్తుంది. డబ్బు లేని వాడు దానిని సంపాదించడానికే అధిక ప్రాధాన్యమిస్తాడు. మరి డబ్బు అధికంగ వున్నవాడు దానినెలా ఖర్చు చేయాలా అంటూ అడ్డదారులు తోక్కుతుంటాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prostitution  Government officer  held on ride  

Other Articles