Ten fake pakistani travel agents in us dupe travellers to india

fake travel agents fraud, fame agents dupe indian travellers, fake travel agents in US, three of ten pakistanis fraud, fake travel agents bilked more than $1 million, pakistan agents duped indians, fake agents draw cash from accounts, pak travel agents in travel scam, pak agents duped 200 travellers

Ten fake travel agents, most of them from Pakistan, have been indicted in a travel scam that left about 200 travellers to India stranded and bilked of more than $1 million

అమెరికా జైలులో.. పండిన పాకిస్థానీయుల పాపం..

Posted: 12/16/2014 03:48 PM IST
Ten fake pakistani travel agents in us dupe travellers to india

రంగు రుచి చిక్కదనం వుంటేనే కమ్మనైన టీ అని ఎలా అంటామో.. అదే తరహాలో కులం, మతం, ప్రాంతం లాంటి ఏ అడ్డుంకులు లేకుండా చేసేదే మోసం, ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. దేశంకాని దేశంలో ఘరానా మోసానికి తెరలేపారు ఆ ఘరానా మోసగాళ్లు. నలుగురు క్విన్స్ దేశీయులతో ఇద్దరు బ్రూక్లిన్ దేశస్థులు ఒక్క బ్రాన్క్స్ దేశీయుడు కలసినా ఏమైనా జరిగేదేమో.. అయితే వీరికి జతగా ముగ్గురు పాకిస్థానీయులు కూడా కలిసే సరికి..అదో ఘరాణ మోసగాళ్ల కోఠారిలా తయరైంది. అంతే పాకిస్థానీయులు మోసానికి ప్రణాళిక రచించారు. మిగతావారంతా వారు చెప్పినట్లుగా నడుచుకున్నారు. భారత్ అంటే నిలువెల్లా విషం నింపుకున్న పాకిస్థానీయులు టార్గెట్ మీకు అర్థమయ్యిందనుకుంటా.

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్ ను కేంద్రంగా చేసుకుని ఈ పది మంది కలసి విదేశాల నుంచి భారత్ కు వెళ్తున్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని పది లక్షల రూపాయల మేర మోసానికి తెరలేపారు. అగ్రరాజ్యం నుంచి భారత్ కు చేరుకునే సుమారు 200 మంది ప్రయాణికులను మోసగించి సోమ్ముచేసుకున్నారు. బాంబే ట్రావెల్స్ అండ్ టూర్స్, రాజ్ ట్రావెల్స్, గాంధీ ట్రావెల్స్, పటేల్ ట్రావెల్స్, మహా గురు ట్రావెల్స్ వంటి ప్రైవేటు దిగ్గజ ట్రావెల్స్ యానామాన్యాలతో తమకు టై అప్ వుందని చెప్పి నకిలీ పాస్ పోర్టులు, లైసెన్సులతో ఆయా ట్రావెల్స్ పేరుతో బ్యాంకులలో ఖాతాలను తెరచారు. తమకు వివిధ ట్రావెల్స్ లో టై అప్ వుందని, మిగతా ఎయిర్ లైన్స్ కన్నా తక్కువ ధరలోనే తాము టిక్కెట్లను అందిస్తామని పేర్కొంటూ భారత అమెరీకన్ పత్రికలలో పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పించారు. అయితే రాయితీలో టిక్కెట్ లభిస్తుందని ఆశపడిన ప్రయాణికులు వీరి వద్ద టిక్కెట్ కొనుగోలు చేశారు. నేరుగా తమ క్రెడిట్ కార్డులతో బ్యాంకులోకి డబ్బులు జమ అవ్వడం, ప్రయాణికులు ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను సూచించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కాగా, నిందితులు బ్యాంకులలో జమ అయిన డబ్బులను తీసుకుని తమ జేబుల్లో నింపుకున్నారు.

తీరా ప్రయాణానికంటూ విమానాశ్రాయలకు చేరుకున్న ప్రయాణికులను అధికారులు అడ్డుకుని విషయాన్ని తెలిపారు. తమ వద్ద వున్నవి నకిలీ టిక్కెట్లని తెలియడంతో ప్రయాణికులు తీవ్ర మనోవేధనకు గురయ్యారు. వీరి మోసానికి గురైన వారిలో ఓ గర్భవతి తమ బంధువుల వివాహ వేడుకను హాజరుకాకుండా చేసిందని, క్యాన్సర్ తో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు వెళ్తున్న ఓ కోడుకును ప్రయాణాన్ని అడ్డుకుంది. జూన్ 2012 నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు సాగిన వీరి అక్రమాలపై పిర్యాదులు అందడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారత్ కు వచ్చే పర్యాటకులను బూరడి కొట్టించి సుమారు పది లక్షలకు పైగా స్వాహా చేసిన ఘరాణా మొసగాళ్లలో క్వీన్స్ దేశానికి చెందిన జుబైర్ ధార్ (49); సర్ఫాజ్ ఖాన్ (51), జాన్ డో, మన్ జీత్ సింగ్ (40)లతో పాటు పాకిస్థాన్ కు చెందిన సుమిత్ ఛావ్లా (42), షా నవాజ్ ఖైనీ (29), బ్రోక్లైన్ కి చెందిన రాణా ముహమ్మద్ తరిఖ్ (32), చౌదరీ మహ్మమద్ ఆరిఫ్(56)లతో పాటు బ్రాక్స్ దేశానికి చెందిన సదఖత్ అలి (48)లు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చారు. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణలో వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fake Pakistani travel agents  Indian travellers  dupe  i million dollars  

Other Articles