Infectious disease caused by either of some virus variant

disease, unknown disease inj india, some unknown disease caused child deaths, chid deaths

little is known about the causes of death in children in India after age five years.

ముంచుకొస్తున్న మహమ్మారి...!!

Posted: 12/12/2014 12:14 PM IST
Infectious disease caused by either of some virus variant

ఓ పెను ప్రమాదం ముంచుకురాబోతుంది. ప్రతి సంవత్సరం దాదాపుగా 58 వేల మంది శిశువులను బలి తీసుకుంటుంది. తల్లి గర్భం నుండే ఈ సూపర్ బగ్ అనే మహమ్మారి ఉత్పాతం చెందటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన కథనం ప్రకారం పిల్లలకు రోగ నీరోధక శక్తి అత్యంత సున్నితంగా ఉండటం వాళ్ళ ఇన్ఫెక్షన్లు సోకినపుడు దానికి సరైన మందును గుర్తించే లోపే ప్రాణాపాయం ముంచుకొస్తుందని ఆ కథనం పేర్కొంది. దీనికి ఉదాహారణగా ప్రముఖ సంగీతకారుడు "మాండొలిన్" శ్రీనివాస్ మృతిని కారణంగా చూపింది. ఐదేళ్ళ క్రితం ఇలాంటి ఇన్ఫెక్షన్లను చూడనే లేదని ఢిల్లీ లోని సర్ గంగారం ఆస్పత్రి నవజాత శిశువు  విభాగం చైర్ పర్సన్ డాక్టర్ నీలం అన్నారు. వివిధ ఆస్పత్రుల నుండి మాకు రిఫర్ చేసిన కేసుల్లో నూటికి నూరు శాతం మల్టీ డ్రగ్ రెసిస్టంట్ ఇన్ఫెక్షన్లతో వస్తున్నాయి. ఇది నిజంగా ఆందోలనకరమని నీలం పేర్కొన్నారు.

దీనికి ప్రధాన కారణం భారత్ లో తీవ్ర పారిశుధ్య లోపమేనని, భారత్ లో ఉన్న తీవ్ర జన సమూహం, అవసరానికి మించి యాంటి బయాటిక్స్ వాడకంవంటి కారణాలు కూడా భారతీయుల ప్రాణాలను హరిస్తునాయని పలు పరిశోధకులు చెప్తున్నారు. ఏది ఏమైనా భారత దేశం లోని పారిశుధ్య లోపం వాళ్ళ కొన్ని అనర్థాలు జరుగుతున్నాయన్నది నమ్మలేని వాస్తవం.

దీనికి ప్రధాన కారణాలు ఏవైనప్పటికీ.., ఇప్పటికి భారత దేశం లో బహిరంగ మల విసర్జన చేసే దుస్త్తి కలిగి ఉండటం మన దురదృష్టం. దీని వల్ల ఇల్లాంటి ప్రమాదాలు ఇంకా ఎనో మున్చుకోస్తఎనని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా స్త్రీ లకు బహిరంగ మల విసర్జన ద్వారా తవరగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

Source: New York Times

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : newyork times  disease  child deaths  unknown virus  

Other Articles