కర్ణాటక రాష్ట్ర రాజకీయం రోజుకో దుమారానికి వేదికవుతుంది. కర్ణాటక నిండు శాసన సభ లో రెండు రోజుల క్రితం ఎం.ఎల్.ఏ చేసిన భాగోతం వేడి ఇంకా చల్లారకముందే ఓ మంత్రి ప్రజాస్వామ్యం అపహాస్యం చేశాడు. ఒక ఎం.ఎల్.ఏ "ప్రభు"ద్దుడు చేసిన పనికే రాష్ట్ర నలుమూలలా చర్చ జరిగింది. ఇప్పుడు ఒక మంత్రి గారు పైగా ఆయన మంత్రి గారు మాత్రమే కాదు ఒక సుప్రసిద్ధ నటుడు కూడానూ....
అధికార పార్టీ కి చెందినా కర్ణాటక గృహ నిర్మాణ మంత్రి, నటుడు అంబరీష్ శాసనసభ సమావేశాల్లో ఒక వైపు చర్చ జరుగుతుంటే మరోవైపు తన పక్కన ఉన్న స్వపక్షానికి చెందిన ఎమ్మెల్యే మల్లికార్జునకు తను ఒక పబ్ లో అసభ్యకరమైన రీతిలో నాట్యం చేస్తూ ఉన్న ఒక చిత్రాన్ని ఆ ఎం.ఎల్.ఏ కు చూపిస్తూ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది...
ఈ సంఘటన తో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. ప్రజలు తమ సమస్యల పట్ల చర్చించి అభివృద్ధి పథాన నడిపించమని ఓట్లు వేసి ఆశీర్వదించి ఆసెంబ్లీ కి పంపిస్తుంటే ప్రజా ప్రతినిధులు చేసే నిర్వాకాలు ఇవి. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్య చరిత్ర లో మాయని మచ్చలుగా మిగిలిపోతాయని పలు ప్రజా సంఘాలు నెత్తి నోరు బాదుకుంటున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి దుస్సంఘటనలు ప్రజాస్వామ్య నైతిక విలువల మనుగడనే ప్రశ్నిస్తున్నాయన్న విషయాన్నీ ప్రజాప్రతినిధులు ఎప్పుడు తెలుసుకుంటారో ....!!
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more