Telangana government approves single window policy in indusitrial sector

telangana single window policy, telangana industrial single window policy, kcr on single window policy, industrial single window policy benfits and losses, telangana government programmes, telangana government latest updates, latest telugu updates, industrial development in telangana and india

telangana government approves single window policy in indusitrial sector : finally on sunday dated 23-11-2014 telangana government approves single window policy in industrial sector of says. telangana government says with latest single window policy state will have best policy in industrial sector

దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. ఇది ఎంతవరకు సాధ్యం...?

Posted: 11/24/2014 10:03 AM IST
Telangana government approves single window policy in indusitrial sector

ప్రజల ఆకాంక్షగా.., 4కోట్ల మంది కలల సాకారంగా ఏర్పడిన ఏర్పడిన తెలంగాణ త్వరలోనే దేశంలో ఆదర్శ రాష్ర్టంగా మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తొలినుంచి చెప్తున్న పారిశ్రామిక ఏకగవాక్ష విధానం (సింగిల్ విండో పాలసీ)ని కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లుతో రాష్ర్టంలో పరిశ్రమల స్థాపన వేగం పెరగటంతో పాటు.., సులభతరం అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఒకే దగ్గర దరఖాస్తులు, అనుమతుల పరిశీలన, రాయితీలు, పరిశ్రమల స్థాపనకు అనుమతులు వంటి పక్రియ పూర్తవుతుందని... ఈ విధానం పరిశ్రమలకు సులభతరం కావటంతో పాటు రాష్ర్టానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి అబివృద్ధికి దోహదం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఆదివారం సమావేశమైన తెలంగాణ కేబినెట్.., పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో పారిశ్రామిక ఏక గవాక్ష విధానం తో పాటు ఇసుక విధానంను ఖరారు చేసింది. కొత్తగా తెలంగాణ రూరల్ రోడ్ డెవలెప్ మెంట్ కార్పోరేషన్, తెలంగాణ వాటర్ గ్రిడ్ కార్పోరేషన్ ఏర్పాటు అంశాలపై చర్చించి ఖరారు చేసింది. మొత్తం 24 అంశాలను చర్చించి ప్రభుత్వం వాటిని ఖరారు చేసింది. అయితే శాసనసభా సమావేశాల నేపథ్యంలో విధానపర నిర్ణయాలు వెల్లడించలేమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ముఖ్యమంత్రి కీలకంగా భావించి.., ప్రత్యేక దృష్టి పెట్టిన పరిశ్రమల సింగిల్ విండో పాలసీని ఆమోదించటం ద్వారా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. విదేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానంతో రాష్ఱ్టంలో పరిశ్రమల స్థాపన సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆదర్శ రాష్ర్టంగా తెలంగాణ మారుతుందని చెప్తున్నా.., అమలులో సవాళ్ళపై మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది.

సింగిల్ విండో విధానంలో ప్రక్రియ అంతా ఒకే చోట కేంద్రీకృతం కావటం వల్ల దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకతతో పాటు వాస్తవికత నిర్ధారణ లోపంగా ఉండే అవకాశం ఉంది. వేగంగా పరిశ్రమలకు అనుమతి ఇవ్వాలన్న తపనలో బోగస్ కంపనీలను గుర్తించకుండా వారికి భూములు రాయితీలు ఇచ్చి తర్వాత ఇబ్బంది పడవచ్చు. గతంలో ఉమ్మడి రాష్ర్టంలో ఈ తరహా అనుభవాలు అప్పటి ప్రభుత్వాలకు ఎదురయ్యాయి. ఇక ఒక చోట కేంద్రీకృతం అయిన సింగిల్ విండో విధానం వల్ల.., పరిశ్రమల దరఖాస్తులు, అనుమతులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. గతంలో వైఎస్ హయాంలో కంపనీల అనుమతులు ఎలా జరిగాయో పరిశీలిస్తే ఈ అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే తెలంగాణ ప్రభుత్వం ఇలా అక్రమాలకు పాల్పడుతుందని చెప్పటం లేదు. కాని జరిగితే అరికట్టేందుకు.., గుర్తించేందుకు సమయం పట్టి, అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పరిశ్రమలకు వేగంగా అనుమతి ఇవ్వటంతో పాటు వాటి వాస్తవికత, పారదర్శకతను గుర్తించాలి. అదేవిధంగా సింగిల్ విండో విధానంలో పనిచేసే అధికారులు, ఉద్యోగుల కదలికలు, వారితో సన్నిహితంగా ఉండే వ్యక్తుల వ్యవహారంపై నిఘా ఉంచితే ప్రభుత్వం కలలు గన్న ‘దేశంలోనే ఆదర్శ రాష్ర్టంగా తెలంగాణ’ అనే స్వప్నం సాకారం అవుతుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : single window policy  telangana government  

Other Articles