Saina nehwal wins china open super series tournament

Saina Nehwal, Akane Yamaguchi, China Open Super Series Tournament, Telangana Government, CM, KCR, Australian Super Series, Japanese, Saina Nehwal, Australian, Victoria, srikanth

saina nehwal wins china open super series tournament

చైనా ఓపెన్ సూపర్ సీరీస్ ను కైవసం చేసుకున్న సైనా

Posted: 11/16/2014 04:28 PM IST
Saina nehwal wins china open super series tournament


భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సంచలన విజయాలలు నమోదు చేసుకున్న అరుదన రోజు ఇది. చైనా ఓపెన్ సూపర్ సీరీస్ టైటిల్స్ ను ఇద్దరు భారతీయులు దక్కించుకున్నారు. అందులోనూ ఇద్దరు హైదరాబాదీయులే ఈ విజయాలను నమోదు చేసుకుని తెలుగువారి సత్తాను నలుదిశాల చాటారు. ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్.. చైనాలోని ఫుజూలో జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ లో జపాన్ క్రీడాకారిణీ అకానే యమాగుచిపై 21-12, 22-20 స్కోర్ తేడాతో విజయం సాధించారు. కేవలం 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ను సైనా ముగించారు. ఈ మ్యాచ్ లో సైనాకు అకానే గట్టిపోటినచ్చింది. అయితే అకానే పై కీలక సమయాల్లో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ ను గెలుచుకుంది సైనా.

పురుషుల సింగిల్స్ టైటిల్‌ను మరో తెలుగుతేజం గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. చైనా దిగ్గజ ఆటగాడు లిన్‌డాన్‌పై కిదాంబి శ్రీకాంత్ 21-19, 21-17తో అద్భుత విజయం సాధించి ఈ విజయం సాధించిన తొలి భారతీయుడుగా నిలిచాడు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించిన లిన్ డాన్ పై శ్రీకాంత్ గెలుసుకోసం చాలా శ్రమించాడు. అయితే 46 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఆద్యంతం శ్రీకాంత్ తన అసాధారణ అటతీరుతో అదిపత్యం కనబర్చాడు. శ్రీకాంత్ గత ఏడాది థాయ్ లాండ్ ఓపెన్ గ్రాండ్ పిక్స్ లోనూ బంగారు పతకం సాధించాడు.

చైనా ఓపెన్, మహిళల, పురుషుల సింగిల్స్ టైటిల్స్ రెండూ హైదరాబాదీ ఆటగాళ్లే కైవసం చేసుకోవడం మరో విశేషం. కాగా చైనా ఓపెన్ సూపర్ సీరిస్ ను గెలిచిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ లకు తెలంగాణ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఇదే తరహా గెలుపులను నమోదు చేసుకుని తెలంగాణ పేరును విశ్వవ్యాప్తం చేయాలని ఆయన అకాంక్షించారు. చైనా ఓపెన్ సీరీస్ ను ఇద్దరు హైదరాబాదీలే గెలుచుకుని రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles