Quick thinking of 4 year old saves her mother from rape in mumbai

Mumbai crime, history sheeter, rape attempt, Sarvant Jaypal, accused, sexual assault, raising alarm, Mulund police, Mumbai

Quick thinking of 4 year old saves her mother from rape in mumbai

తల్లిని అత్యాచారం నుంచి కాపాడిన నాలుగేళ్ల చిన్నారి

Posted: 10/31/2014 06:20 PM IST
Quick thinking of 4 year old saves her mother from rape in mumbai

ఓ నాలుగేళ్ల చిన్నారి తన కన్న తల్లిని అత్యాచారం నుంచి కాపాడింది. అప్పటి వరకు నిద్రిస్తున్న ఆ చిన్నారు.. కళ్లు తెరవగానే తన తల్లి.. దీనంగా వేడుకుంటున్న దృశ్యం కనబడింది. అంతే తన మదిలో మెదిలిన ఆలోచనను ప్రణాళిక బద్దంగా అమలుపర్చి తన తల్లిని కాపాడుకుంది. అత్యాచారం చేయబోయిన దుండగుడిని స్థానికులు దేహశుద్ది చేసి.. పోలీసులకు అప్పగించారు. ఇంతకు ఆ నాలుగేళ్ల చిన్నారి ఏం చేసింది..? ఎలా తన తల్లిని కాపాడింది..?

భర్త భయటకు వెళ్లి స్థానికంగా వున్న ఓ టీ కోట్టు వద్ద టీ తాగుతుండగాన్ని గమనించిన పాత నేరస్థుడు సార్వెంట్ జైపాల్.. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించాడు. అమె కడుపు వద్ద కత్తిని నిలిపి తన బట్టలను తీయాల్సిందిగా కోరాడు. తన ఇద్దరు పిల్లలు పడుకున్నారని, వారి ఎదుట తనను వివస్త్రను చేయరాదని ఆ ఇల్లాలు వేడుకుంది. అయినా కనికరం లేని ఆ మానవ మృగం అమె వస్త్రాలను బలవంతంగా తొలగిస్తున్నాడు. దీంతో అమె దుండగుడిని వేడుకోంటోంది. తనను ఏమీ చేయవద్దని అర్థిస్తోంది.

ఈ అలికిడితో మేల్కోన్న పెద్ద కుమార్తె.. తన తల్లి ఎదుర్కోంటున్న పరిస్థితిని చూసి ఓక్కసారిగా షాక్ గురైంది. తన తల్లిని కాపాడాలన్న యోచతో నిద్రిస్తున్నట్లు నటించింది. దుండుగుడు తన తల్లిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా నాలుగేళ్ల చిన్నారి ఎలాంటి శబ్ధం చేయకుండా ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఆ తర్వాత పెద్దగా కేకలు వేసింది. దీంతో అక్కడి చేరుకున్న ఇరుగుపొరుగువారు తన తల్లిని దుండగుడి నుంచి రక్షించారు.

మహారాష్ట్రలోని ముంబై ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శర్వంత్ జైపాల్(29) అనే నిందితుడు ఉదయం 7గంటలకు ములుంద్‌లోని ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆ మహిళ తనను అత్యాచారం చేయవద్దని నిందితుడ్ని వేడుకుంది. ఆమె వేడుకున్నప్పటికీ ఆమె మాటలు వినకుండా కత్తితో బెదిరింపులకు దిగి ఆమె దుస్తులను విప్పేందుకు ప్రయత్నించాడు. కాగా, అక్కడే ఆమె ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఒకరు నిద్రిస్తుండగా, మరొక నాలుగేళ్ల చిన్నారి మెళుకువగా ఉంది. తన తల్లి ఏడుస్తుండగా చూసిన ఆమె నిద్రిస్తున్నట్లుగా నటించి.. అవకాశం దొరికిన వెంటనే తలుపుతీసుకుని బయటికి వచ్చింది. సాయం చేయాలని ఇరుగుపొరుగువారిని కేకలు పెట్టి పిలిచింది. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చిన్నారి మొదట తనను పిలిచి సాయం చేయాలని కోరిందని, తాను అందరిని పిలిచి నిందితుడ్ని పట్టుకున్నామని ఓ స్థానికుడు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు జైపాల్‌పై పాత నేరస్థుడేనని, ఇంతకుపూర్వం కూడా అతనిపై పలు కేసులు ఉన్నాయని, గతేడాది కూడా అతడు జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడ్ని రిమాండ్‌కు తరలించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles