Elections result gif

maharastra election results, haryana election results, haryana partywise seats, maharastra partywise election results, latest updates, congress scams, congress seats in maharastra and haryana, latest updates

maharastra and haryana elections also given bitter result to congress : maharastara and haryana assembly election results favoured bjp in haryana bjp going to form government with 47seats in maharastra the flower party secured 122seats outof 288 so waiting for alliance formation but congress failed to show strength in both states

చేసిన పాపాలు ఊరికే పోతాయా... శాపాలై తగులుతాయి

Posted: 10/20/2014 09:04 AM IST
Elections result gif

కుంభకోణాల పార్టీగా పేరున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో మరోసారి పరాభవం చవిచూసింది. మహారాష్ర్ట, హర్యానా ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. రెండు రాష్ర్టాల్లోనూ ఘోరంగాపరాభవం చవిచూసిందనే చెప్పాలి. ఇందుకు మోడి మ్యానియా ఒక కారణం అయితే.., ప్రభుత్వంలో ఉండగా యూపీఏ చేసిన తప్పులు రెండవ కారణం. దేశ ప్రజలు కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సులువుగా మర్చిపోలేకపోతున్నారు. అందువల్లే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫలితం హస్తంకు అనుకూలించటం లేదు. గతకాలపు తప్పిదాలే ఇప్పుడు వెంటాడుతున్నాయి.

మహారాష్ర్టలో మొత్తం 288 స్థానాలకు జరిగిన జరిగిన ఎన్నికల్లో బీజేపి 122సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. 63స్థానాలతో శివసేన రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత 42స్థానాలతో కాంగ్రెస్, 41స్థానాలతో ఎన్సీపీ నిలిచాయి. సార్వత్రిక, తాజా ఎన్నికలకు ముందు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, మహారాష్ర్టలో ఎన్సీపి అధికారంలో ఉంది. ఈ రెండు మిత్రపక్షాలు. రెండు ప్రభుత్వాల హయాంలో ఎన్నో అక్రమాలు, కుంభకోణాలు జరిగాయి. కోల్ స్కాం, 2జీ, ఆదర్శ్ ఇలా అనేక అవినీతి మరకలు రెండు పార్టీలకు పట్టుకున్నాయి. అందువల్లే ప్రజలు ప్రత్యామ్నయంకు పగ్గాలు అప్పగించారు.

ఇక హర్యానాలో అయితే చెప్పనవసరం లేదు. భూపేంద్రసింగ్ హుడా పై వచ్చిన ఆరోపణలు.., ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు ఎన్నికల్లో స్పష్టమైన ప్రభావం చూపించాయి. 90స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపి 47స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుంది. కాంగ్రెస్ 15స్థానాలతో మూడవస్థానంకు పరిమితం అయింది. అంటే నిన్నటి వరకు అధికారపక్షంగా ఉన్న పార్టీ ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేదు.. ఈ తీర్పును కాంగ్రెస్ స్వీకరించటం తప్ప వ్యతిరేకించలేదు. ఎందుకంటే వారు చేసిన తప్పుల వల్లే ఇలా జరిగిందని హస్తం నేతలకూ తెలుసు.

స్వాతంత్ర్యం సాధించిన పార్టీగా.., ఇంధిరా, రాజీవ్ వారసత్వంగా కాంగ్రెస్ ను కొంతకాలం వరకు అంతా గౌరవించారు. కానీ ఈ మర్యాదను నేతలు నిలబెట్టుకోలేదు. నమ్మకం ముసుగులో ప్రజాధనంను నిలువుగా దోచుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఒక్కటైన దేశ ప్రజలు కాంగ్రెస్ ఎక్కడ కన్పించినా అవమానించటం మొదలు పెట్టారు. ఇది ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలను మోసం చేస్తే ఏం జరుగుతుందో తెలిసేందుకు ఇది ఉదాహరణ. ఓటర్లు, ప్రజలు ఒకప్పటిలా లేరిప్పుడు. ఎంతో చైతన్యం అయ్యారు. తమకు ఎవరు మంచి చేయగలరు అని డిసైడ్ అయి వారిని ఎన్నుకుంటున్నారు. కాబట్టి ప్రజలకు నమ్మకం కల్గించినవారే విజేతలు. ఈ విషయం గ్రహించి మంచిగా ఉంటే మంచి జరుగుతుంది... లేదంటే హిస్టరీ రిపీట్ అవుతుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharastra  haryana  bjp  congress  

Other Articles