Telangana government and juda talks not fruitful

junior doctors strike, junior doctors strike in telangana, junior doctors strike in andrapradesh, junior doctors on telangana government, juda strike in telangana, juda strike latest updates, junior doctors 2years rural service act, latest updates

junior doctors fires on telangana government : judas alias junior doctors fires on telangana goverment for not discussing about main problems and other issues of them but telangana govermnent says they are not going back on rural service of doctors

తెలంగాణలో జు.డాక్టర్ల ప్రవర్తన బాగోలేదు.

Posted: 10/20/2014 07:47 AM IST
Telangana government and juda talks not fruitful

తెలంగాణలో జు.డా.లు చేస్తున్న సమ్మె రోజురోజుకూ ఉద్రిక్తం అవుతుంది. గ్రామీణ సేవలకు వ్యతిరేకంగా తెలంగాణలోని వివిధ బోధనాసుపత్రుల జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. వీరితో ఆదివారం ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.చర్చల్లో పాల్గొన్న ప్రభుత్వం.., జుడాలు  గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. దీనిపై జుడాలు మండిపడుతున్నారు. చర్చలకు అని పిలిచి సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం అవమానించింది అని జుడాల సంఘం ప్రతినిధి వంశీ విమర్శించారు.

కేవలం ఇద్దరిని పిలిచి మొక్కుబడిగా చర్చలు జరిపి.., చివరకు డిమాండ్లను పరిష్కరించకుండా అవమానించారని మండిపడ్డారు. అందువల్లే ప్రభుత్వంపై చర్చలను తాము బాయ్ కాట్ చేశామని చెప్పారు. అయితే జుడాల వైఖరిని ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా తప్పుబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు ఎందుకు అందించరు అని తెలంగాణ వైద్య, వైద్య విద్య శాఖమంత్రి రాజయ్య ప్రశ్నించారు. గ్రామాల్లో సర్వీసులపై అసెంబ్లీలో చట్టం కూడా చేశామని.., ఇప్పుడు ఈ చట్టాన్ని మార్చాలంటే ఎలా కుదురుతుంది అన్నారు. కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి..,. లేదా అఖిలపక్షంలో చర్చించి అందర్నీ ఒప్పించాలి అన్నారు.

ప్రస్తుతం విభజన ప్రక్రియ పూర్తికాని నేపథ్యంలో సమ్మె చేయటం సరికాదన్నారు. జుడాల సమ్మెను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. అటు జుడాల వ్యవహారశైలిపై కూడా రాజయ్య నిప్పులు చెరిగారు. పెద్దలు, ప్రభుత్వం అనే గౌరవం లేకుండా జూనియర్ వైద్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వేలుచూపించి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అటు చర్చలకు జుడాలు కానివారు, జుడాల సంఘంలో సభ్యత్వం లేనివారు కూడా వస్తున్నారు అని వివరించారు. అందువల్లే కేవలం పరిమిత సంఖ్యలో చర్చలకు జుడాలను అనుమతించామన్నారు.

అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులపై ప్రభుత్వం వెనక్కి తగ్గదన్నారు. గ్రామాలు, ప్రజలకు సేవచేయటానికి ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. గ్రామీణ సర్వీసులను జుడాలు తిరస్కరించటం అన్యాయమని మంత్రి రాజయ్య పేర్కొన్నారు. వారి వైఖరి మార్చుకుంటే మిగతా డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior doctors  telangana  rajaiah  strike  

Other Articles