Beer prices may go up by 20 percent

Telangana governament, raises, beer prices, 20 percent, implements. november, beverage companies, tender commitee, beerbhals

Telangana governament raises beer prices by 20 percent, implements from november

బీర్ బలులు ఇక మీ జేబులకు చిల్లులూ..!

Posted: 10/11/2014 12:54 PM IST
Beer prices may go up by 20 percent

బీరుబల్లులూ.. జాగ్రత్త.. ఇక మీ జేడులకు చిల్లులు పడటం తథ్యమని సంకేతాలు అందుతున్నాయి. కేవలం బీరునే ఆస్వాదించే వారిని టార్గెట్ చేయనున్నాయి. ఎందుకంటే బీర్లు మరింత ప్రియం కానున్నాయి. త్వరలో బీరు సీసాపై 20 శాతం వరకు ధరలు పెరుగనుట్టు సమాచారం. ముడిసరుకు ధరలు, ఉత్పత్తి వ్యయం పెరగడం వంటి కారణాలతో తమకు నష్టం వస్తుందని, వెంటనే ధరలు పెంచాలని చాలాకాలంగా బ్రేవరీల యజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. బీరు ధర 35 శాతం వరకు పెంచొచ్చని రాష్ట్ర విభజనకు ముందే టెండర్ కమిటీ సిఫారసు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత బీర్ల ధరల పెంపు ప్రతిపాదన పెండింగ్‌లో పడింది.

బీర్ల ధరలను అమాంతం 35 శాతం పెంచేందకు తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది. కేవలం బీరు తాగే వారిని టార్గెట్ గా చేసి సర్కారు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి ఆదాయం ముఖ్యమే కానీ.. మందుబాబుల వ్యవసాన్ని ఆదాయంగా మలుచుకోవడం తప్పని పేర్కొంటోంది. బీరు సంస్థల యాజామాన్యాల ఒత్తిడి మేరకు 20 నుండి 25 శాతం ధరలు పెంచితే ఎలా వుంటుందని యోచిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో బీరు సంస్థల యాజామాన్యాలు దిగివచ్చాయి. టెండర్ కమిటీ 25 శాతం పెంచాలని మరోసారి సిఫారసు చేసింది. ప్రస్తుతం టెండర్ కమిటీ గడువుకూడా ముగిసింది. బీర్లపై 20 శాతం ధరలు పెంచే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. బీరులు బ్రాండ్‌ను బట్టి రూ. 90 నుంచి 120 వరకు లభ్యమవుతున్నాయి. తెలంగాణలో నెలకు దాదాపు నాలుగుకోట్ల 80 లక్షల బీర్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. ధరల పెంపు వల్ల రూ. 400 నుంచి 500 కోట్ల వరకు మద్యం ప్రియులపై భారం పడనుంది. వచ్చేనెల నుంచి ఇది అమలులోకి రావచ్చని అధికారులంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles