Missing techie bhavya sri cell phone signals traced in visakha district paderu

Bhavya Sri, Mystery, techie missing, Traced, Missing case, paderu, mobile phone signals, software engineer, kukatpally, police

missing techie bhavya sri cell phone signals traced in visakha district paderu

భవ్యశ్రీ ఇష్టంగానే వెళ్లిందా..? కిడ్నాప్ కు గురైందా..?

Posted: 10/11/2014 11:29 AM IST
Missing techie bhavya sri cell phone signals traced in visakha district paderu

సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత అదృశ్యంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆఫీస్ కు వెళ్తున్నట్ల భర్తకు మేసేజ్ పెట్టన భవ్యశ్రీ ఎక్కడకు వెళ్లింది. ఏమైంది..? ఎవరైనా కిడ్నాస్ చేశారా..? లేక వివాహిత ను ట్రాప్ చేశారా..? లేక ఇష్టపూర్వకంగానే వెళ్లిందా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. రెండేళ్ల క్రితం కార్తీక్ చైతన్యను ప్రేమ పెళ్లి చేసుకున్న భవ్యశ్రీ.. మిస్పింగ్ మిస్టరీని చేధిందే పనిలో వున్నారు పోలీసులు.

గురువారం ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన భవ్యశ్రీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమె ఏమైందో..? ఎక్కడ వుందన్న సమాచారం మాత్రం తెలియడం లేదు. అన్యోన్యంగా వుంటే భార్యభర్తల మధ్య ఎవరైనా తలదూర్చారా..? లేక భవ్య ఇష్టంగానే వెళ్లిందా..? బాహ్య ప్రపంచానికి తెలియని వేధింపులను, మనోవేధనను భర్త, అత్తవారింటి నుంచి ఎదుర్కొనిందా..? కిడ్నాప్ కు గురైందా..? ట్రాప్ లో చిక్కుకుందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కిడ్నాపర్లు భవ్య పోన్ ను తీసకుని పోలీసులను తప్పుదారి పట్టిస్తున్నారా..? అన్న అనుమనాలు కూడా కలుగుతున్నాయి
.
ఆఫీసు వెళ్లని భవ్వశ్రీ.. భర్తతో ఆఫీసుకు వెళ్తున్నానని అబద్దం ఎందుకు చెప్పింది..? ఇంటి వద్దకు అఫిస్ క్యాబ్ వచ్చిందని.. అందులోనే వెళ్తున్నానని చెప్పి ఎక్కడకు వెళ్లింది.? ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారమే భర్తకు అబద్దం చెప్పిందా..? ఎవరి ట్రాప్ లోనైనా చిక్కకుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వీటితో పాటు తన భార్యపై అనుమానం వచ్చిన కార్తీక్ భవ్యను ఏమైనా చేశాడా..? అమె ఆఫీసుకు వెళ్లడం లేదని ముందే తెలుసుకున్న కార్తీక్ ప్రణాళికా బద్దంగా భవ్యశ్రీపై ప్రతికారం తీర్చుకున్నాడా అన్న అనుమానాలూ రేకెత్తుతున్నాయి. పోలీసులు దర్యాప్తులోనే నిజానిజాలు వెల్లడి కావాల్సి వుంది.

అయితే భవ్యశ్రీ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసేందుక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సిగ్నల్స్ ఆధారంగా విశాఖ జిల్లా పాడేరు గెస్ట్హౌస్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించిన సైబరాబాద్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్నారో ఏమో తెలియదు కానీ.. గెస్ట్హౌస్కు చేరుకున్న సైబరాబాద్ పోలీసులకు...అమె కనిపించలేదు. అయితే అంతకు ముందు అక్కడ ఎవరో వుండి టీవీని వీక్షిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. మీడియాలో వస్తున్న కథనాలతో అప్రమత్తమైన భవ్యశ్రీ అక్కడ నుంచి మరో చోటుకు వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భవ్యశ్రీ మిస్సింగ్పై మీడియాలో విస్తృత కవరేజ్ ఉండటంతో...ఆమె ఎప్పటికప్పుడు సమచారాన్ని తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం ఆమె సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో పడ్డారు. శుక్రవారం సాయంత్రం భవ్యశ్రీ ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్‌టవర్ పరిధిని సూచించడంతో అక్కడి పోలీసులు అన్నవరంలో అన్ని లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాల్లో తనిఖీ చేశారు. అయినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. మధ్యలో ఆమె గోవా వెళ్లినట్లు కూడా అనుమానించారు. మరోవైపు మూడు రోజులైనా భవ్యశ్రీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles